బాబ్ డిలాన్ ఆరువందలకు పైగా పాటల హక్కులను యూనివర్సల్ మ్యూజిక్ పబ్లిషింగ్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఈ బ్లాక్‌బస్టర్ అగ్రిమెంట్ ద్వారా మూడువందల మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వస్తుందట. వాళ్లెవరో సొంతం చేసుకోవడం ఏమిటి? ఆ పాటలను ప్రపంచంలో ఆబాలగోపాలం ఎప్పుడో సొంతం చేసుకుంది అనుకుంటే అది కూడా అక్షరాల నిజమే! బాబ్ పాట మీద హక్కు సాంకేతిక విషయం మాత్రమే. అది అందరి పాట. ఎందుకంటే..
మాస్టర్స్ ఆఫ్ వార్ (1963)
ఇప్పుడు యుద్దాలు ఆత్మరక్షణ కోసం జరగడం లేదు, ప్రజల దృష్టిని మళ్లించి పాలనను సుస్థిరం చేసుకోవడానికి జరుగుతున్నాయి. ఇప్పుడు యుద్దం అంటే హింస మాత్రమే కాదు అనేక కుట్రసిద్దాంతాల సమహారం. అందుకే ఒక కళాకారుడిగా బాబ్ డిలాన్ గళం విప్పాడు. యుద్దోన్మాదాన్ని నడివీధిలో నగ్నంగా నిలబెట్టాడు. ప్రపంచాన్ని ఆటబొమ్మగా చేసుకుని ఆడుకునే మాస్టర్స్ ఆఫ్ వార్‌ని ఇలా నిలదీశాడు... ‘యూ ప్లే విత్ మై వరల్డ్ లైక్ ఇట్స్ యువర్ లిటిల్ టాయ్ యూ పుట్ ఏ గన్ ఇన్ మై హ్యాండ్ అండ్ యూ హైడ్ ఫ్రమ్ మై ఐస్’
న్యూ మార్నింగ్ (1970)
స్వప్నించే హృదయం ఉండాలేగానీ ప్రతి ఉదయం ఒక కొత్త ఉదయాన్ని పరిచయం చేస్తుంది. ‘ఆ..ఏముంది లే. అన్ని రోజుల్లాగే ఈరోజు కూడా’ అనుకునే నిత్య నిరాసక్తవాదులకు ఈ పాట సరికొత్త మేలుకొలుపు. సింప్లీ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ విలువ ఏమిటో చెబుతుంది.
‘సో హ్యాపీ జస్ట్ టు బీ అలైవ్’
‘సో హ్యాపీ జస్ట్ టు సీ యువర్ స్మైల్’
సేవ్‌డ్ (1980)
భగవంతుడు మన కోసం ఎన్నో చేశాడు. అతడి కోసం ఏం చేయగలం? రుణాన్ని ఎలా తీర్చుకోగలం?
కనిపించని భగవంతుడు నిత్యం మనకు కనిపించే మనుషుల్లో దానం, ధర్మం, త్యాగం...రకరకాల రూపాల్లో ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటాడు.
‘యూ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్ టు మీ
వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ
యూ హ్యావ్ గివెన్ మీ ఐస్ టు సీ
వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ’
అండర్ ది రెడ్ స్కై (1990)
గబ్బీ గూగూ (ముద్దుపేరు) అనే అమ్మాయికి అంకితం ఇచ్చిన ఈ పాట సింపుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సాగుతుంది. పిల్లలకు నచ్చే జానపదకథలాంటి పాట ఇది. కాల్పనిక ప్రపంచంలో మనల్ని ఊరేగించే పిల్లల పెద్దల పాట. అంతేనా! కానే కాదు అంటారు విశ్లేషకులు. పర్యావరణానికి మన చేటును గురించి హెచ్చరించి పాట అంటారు.
‘లెట్ ది బర్డ్ సింగ్...లెట్ ది బర్డ్ ఫ్లై’
షాడోస్ ఇన్ ది నైట్ (2015)
నిన్ను చూడడం తప్పేమో తెలియదు. చూస్తూనే ఉంటాను. నిన్ను పలకరించడం తప్పేమో తెలియదు. పలకరిస్తూనే ఉంటాను. నిన్ను ధ్యానించడం తప్పేమో తెలియదు. ధ్యానిస్తూనే ఉంటాను. నిన్ను ప్రేమించడం తప్పేమో తెలియదు. ప్రేమిస్తూనే ఉంటాను....
‘ఐ లవ్ యూ ఐ నీడ్ యూ...ఐ నో ఇట్స్ రాంగ్...ఇట్ మస్ట్ బీ రాంగ్
బట్ రైట్ ఆర్ రాంగ్ ఐ కాంట్ గెట్ ఎలాంగ్ విత్‌ఔట్ యూ’
బాబ్‌రే... నిత్య యవ్వనం నీ స్వరం!
Published Wed, Dec 16 2020 11:38 AM | Last Updated on Wed, Dec 16 2020 12:46 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment