బీజింగ్ : కరోనా వైరస్ పుట్టినిల్లయిన చైనాలో వ్యాక్సిన్ తయారీ ఊపందుకుంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ మనుషులపై ప్రయోగించేందుకు చైనా ఆమోదం తెలిపినట్లు చెంగ్డులోని స్థానిక ప్రభుత్వం శనివారం తెలిపింది. చెంగ్డూలోని సిచువాన్ విశ్వవిద్యాలయానికి చెందిన వెస్ట్ చైనా హాస్పిటల్ అభివృద్ధి చేసిన ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి పొందినట్లు పేర్కొంది. చైనా తన ప్రయోగాలలో సూక్ష్మ జీవులలో కూడిన ప్రొటిన్ అభివృద్ధి చేసనట్లు వెల్లడించింది. ఇప్పటికే దీనిని కోతులపై పరీక్షించినప్పుడు ఎలాంటి దుష్ప్రభావాలు లేవని,సత్ఫలితాలను ఇచ్చిందని తెలిపింది.
వీటితో పాటు చైనీస్ శాస్త్రవేత్తలు దాదాపు ఎనిమిది రకాల కరోనా వ్యాక్తిన్లను పరిశీలిస్తున్నారని, ఇవి ప్రస్తుతం వివిధ దశల్లో క్లినకల్ ట్రయల్స్ జరుగుతున్నాయని తెలిపారు. జర్మనీకి చెందిన బయోఎంటెక్, అమెరికాలోని ఇనోవియో ఫార్మాతో సహా విదేశీ కంపెనీలు చైనాలో తమ ప్రయోగాత్మక వ్యాక్సిన్లను పరీక్షించడానికి స్థానిక సంస్థలతో సహకరిస్తున్నాయి. కరోనాను అరికట్టేందుకు చైనా తయారుచేసే వ్యాక్సిన్‌ను ఎక్కువ ధరతో అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment