
బీజింగ్ : చైనా యువత నిరసన తెలపడంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్కడ చూసినా పక్షుల తరహాలో being a bird దుస్తులు ధరిస్తున్నారు. వాటిలాగే శబ్ధాలు చేస్తున్నారు. అందుకు ప్రభుత్వాలు తీసుకున్న మతిలేని చర్యే కారణమని తెలుస్తోంది.
చైనాలో ‘996’ పని విధానాన్నిఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పని విధానంలో ఉద్యోగులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 9గంటల వరకు పనిచేయాలి. వారానికి 6 రోజులు పనిదినాలు. అయితే ఈ వర్క్ కల్చర్‌ను ఉద్యోగులు,యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పక్షుల తరహా దుస్తులు ధరిస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెక్కల్ని ధరించి చెట్లెక్కడం, కుర్చీ ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
ఇక పక్షుల తరహాలో ప్రవర్తించడం కొంచెం వింతగా ఉన్నప్పటికీ.. పనివిధానం, లేదంటే గంటల కొద్ది నిర్వహిస్తున్న స్టడీ అవర్స్ నుంచి తమకు విముక్తి కలిగించాలని, పక్షుల్లా తమకూ స్వేచ్ఛ కావాలనే ఉద్దేశ్యంతో ఈ చర్యలకు ఇలా ప్రవర్తిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల డిగ్రీని పూర్తి చేసుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు ఆందోళన చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. ర్యాట్‌రేస్‌లాంటి వర్క్ కల్చర్ , 996 పని విధానం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని వాపోతున్నారు.
ఇక.. చైనాలోని యువత సోషల్ మీడియాలో దేశ పని సంస్కృతిపై తమ నిరాశను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో బాయి లాన్ అనే పదాన్ని ట్రెండ్ చేశారు. ఎన్‌బీయే బాస్కెట్ బాల్ వీడియో గేమ్‌లో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా బాస్కెట్ బాల్‌ను విసిరే పద్ధతి. ఈ కాన్సెప్ట్‌ను ఉపయోగించిన చైనా పౌరులు పని సంస్కృతిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తమగళాన్ని వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment