work culture
-
పరుష పదజాలం, భారీ లక్ష్యాలు.. సెబీ చీఫ్ పనితీరుపై లేఖ
సెబీ ఛైర్పర్సన్ మాధబి పురీ బుచ్ పనితీరుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. పని సమయాల్లో కిందిస్థాయి సిబ్బందితో పరుష పదజాలాన్ని వాడుతున్నారని, అవాస్తవ లక్ష్యాలను నిర్దేశిస్తున్నారని సెబీ అధికారులు ఆర్థిక మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు.సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అధికారులు ఇటీవల సంస్థ చీఫ్ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. ఫిర్యాదులోని వివరాల ప్రకారం మాధబి కిందిస్థాయి ఉద్యోగులతో సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ ఆపై స్థాయి సిబ్బంది మొత్తం సెబీలో 1000 మంది ఉన్నారు.అందులో 500 మంది ‘గ్రీవెన్స్ ఆఫ్ సెబీ ఆఫీసర్స్-ఎ కాల్ ఫర్ రెస్పెక్ట్’ అనే శీర్షికతో రాసిన ఫిర్యాదు లేఖపై సంతకం చేసినట్లు తెలిసింది. స్నేహపూర్వక విధానాలు, పని సమయంలో వేధింపుల వంటి అంశాలపై సెబీ అధికారులు ఆందోళన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి. ఇది తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిందని లేఖలో తెలిపారు. సెబీ ఉన్నతాధికారులకు గతంలో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు అధికారులు పేర్కొన్నారు. పని సామర్థ్యాన్ని పెంచే పేరుతో మేనేజ్మెంట్ వ్యవస్థలను సమూలంగా మార్చేసి తిరోగమన విధానాలను అమల్లోకి తెచ్చిందని చెప్పారు. దాంతో సంస్థకు నష్టం వాటిల్లుతుందన్నారు.ఈ ఏడాదికి సంబంధించి ‘కీ రిజల్ట్ ఏరియా(కేఆర్ఏ)’ లక్ష్యాలను మేనేజ్మెంట్ 20-50% పెంచిందని లేఖలో తెలిపారు. డిసెంబర్ నాటికి ఉద్యోగులు ఆ లక్ష్యాలను సాధించాలని అధికారులు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది వాస్తవానికి దరిదాపుల్లో కూడా లేదని, దాంతో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతున్నాయని చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై సెబీ మెయిల్ ద్వారా స్పందించింది. ఉద్యోగులతో ఉన్న సమస్యలను పరిష్కరించినట్లు తెలిపింది. చాలా సంప్రదింపుల తర్వాత కేఆర్‌ఏలను రూపొందించామని కొందరు అధికారులు తెలిపారు. ఉద్యోగులు సమస్యను లేవనెత్తిన తర్వాత అన్ని విభాగాలతో సమీక్షించామన్నారు. కొన్ని డిపార్ట్‌మెంట్‌ల్లో చిన్న సర్దుబాట్లు జరిగాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రూ.1.44 లక్షల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదంఇటీవల సింగపూర్, మారిషస్‌లకు చెందిన డొల్ల కంపెనీల ద్వారా మాధబి అదానీ గ్రూప్‌ల్లో పెట్టుబడి పెట్టారని హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని ఇటీవల కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
రాజీనామాకూ కన్సల్టెన్సీ
మన దగ్గర ఉద్యోగం కలి్పంచడం కోసం బోలెడన్ని కన్సల్టెన్సీలు ఉంటాయి. కానీ ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ అందుకు భిన్నం! అక్కడ రాజీనామా చేయాలనుకునే ఉద్యోగుల కోసం కన్సల్టెన్సీలుంటాయి!! అవి ఇటీవల దేశవ్యాప్తంగా పుట్ట గొడుగుల్లా పెరుగుతున్నాయి. రాజీనామాకు కన్సల్టెన్సీలు ఎందుకా అనుకుంటున్నారా? జపాన్ పని సంస్కృతి, అందులోని సంక్లిష్టతలే అందుకు కారణం... రాజీనామా చేయాలంటే ఏం చేస్తాం? గడువు ప్రకారం రాజీనామా లేఖ ఇస్తాం. అంతటితో సరిపోతుంది. కానీ జపాన్‌లో రాజీనామా అంత ఈజీ కాదు. అక్కడి పని సంస్కృతే ఇందుకు కారణం. అక్కడ కెరీర్ మొత్తం ఒకే సంస్థలో కొనసాగించే వాళ్ల సంఖ్యే ఎక్కువట. చేస్తున్న పని ఇష్టం లేకపోయినా, బాస్ తీరు నచ్చకపోయినా వేధింపులకు భయపడో, మరో కారణంతోనో కష్టంగా అదే ఉద్యోగంలో కొనసాగుతున్న వాళ్లు చాలామంది. సరిగ్గా ఇలాంటి వాళ్లకు సాయం చేసేందుకే పుట్టుకొచ్చాయి ‘రాజీనామా కన్సల్టెన్సీలు’. ఇవి కొవిడ్‌కు ముందే ఉన్నా, ఆ మహమ్మారి తదనంతర కాలంలో ఆదరణ బాగా పెరిగింది. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 11,000 పై చిలుకు క్లయింట్ల తమ సేవల గురించి ఎంక్వైరీ చేసినట్టు ‘మోమూరి ఆపరేషన్స్’ అనే రాజీనామాల కన్సల్టెన్సీ సంస్థ చెబుతోంది. ‘మోమూరి’ అంటే జపనీస్‌లో ‘నేనీ పని ఇంకే మాత్రమూ చేయలేను (ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్)’ అని అర్థం! ఇది 2022లో పుట్టుకొచి్చంది. కర్ర విరక్రుండా, పాము చావకుండా ఎలా రాజీనామా చేసి బయట పడాలో ఇవి సలహాలిస్తాయన్నమాట. ఈ వ్యవహారంలో చట్టపరమైన వివాదాల్లాంటివి తలెత్తితే కూడా అవే చూసుకుంటాయి. అధిక పని సంస్కృతి... జపాన్‌లో చాలాకాలంగా అధిక పని సంస్కృతి ఉంది. రంగమేదైనా ఉద్యోగులకు పనివేళలు మరీ ఎక్కువ. ఏకధాటిగా 12 గంటలు పని చేయడం చాలా మామూలు విషయం. ఇల్లు చేసేసరికి ఏ అర్ధరాత్రో అవుతుంది. మళ్లీ ఉదయాన్నే హడావుడిగా బయల్దేరాలి. ఇలా వెనక్కు తిరిగి చూసుకుంటే పనిలో కరగదీసిన జీవితమే తప్పితే సరదాగా గడిపిన క్షణాలంటూ పెద్దగా కన్పించడం లేదని వాపోయేవాళ్ల సంఖ్యే అధికం. వీటికి తోడు సూపర్వైజర్లు, మేనేజర్ల నుంచి ఒత్తిళ్లు. తట్టుకోలేక రాజీనామాకు ప్రయతి్నస్తే యజమానులు వేధిస్తారట. ఇలాంటి సంస్థలను ‘నల్లజాతి సంస్థలు’గా పిలుస్తుంటారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాల్లోనే గాక పెద్ద సంస్థల్లోనూ ఈ సంస్కృతి ఉందట. బాధితుల్లో ప్రధానంగా ఆహార పరిశ్రమ కార్మికులు, ఆ తర్వాత ఆరోగ్య సంరక్షణ, సంక్షేమ రంగాల వారున్నారు. పరిస్థితి ఎంతదాకా వెళ్లిందంటే, తీవ్రమైన పని ఒత్తిడి పెట్టే సంస్థల జాబితాను ప్రభుత్వమే నిషేధిత జాబితాలో పెట్టడం ప్రారంభించింది! అలా జపాన్వ్యాప్తంగా ఇప్పటికే 370కి పైగా కంపెనీలు లేబర్ బ్యూరో బ్లాక్ లిస్ట్‌లో చేరాయి. అధిక పని ఒత్తిడి వల్ల మెదడు, గుండె సంబంధిత జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య జపాన్‌లో పెరుగుతోందట. 31 ఏళ్ల జర్నలిస్టు ఒకామె కేవలం పని ఒత్తిడి వల్లే హార్ట్ ఫెయిల్యూర్‌తో మరణించింది. చనిపోవడానికి ముందు ఒకే నెలలో ఆమె ఏకంగా 159 గంటలు ఓవర్ టైమ్ పని చేసిందట! అలాగే ఓ 26 ఏళ్ల వైద్యుడు కూడా ఒకే నెలలో 200 గంటలకు పైగా ఓవర్ టైమ్ పనిచేసి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు! మారుతున్న యూత్.. ఈ పని జపాన్‌లో ఎప్పటినుంచో సంస్కృతి ఉన్నా రాజీనామా కన్సల్టెన్సీలు ఇటీవలి కాలంలోనే ఎందుకు పుట్టుకొచ్చాయి? అంటే యువత ఆలోచనల్లో వచి్చన మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. జపాన్‌లో ఉద్యోగుల్లో వృద్ధుల సంఖ్య తగ్గుతోంది. ఎక్కడ చూసినా యువ ఉద్యోగులే. ఉద్యోగం స్వభావంతో సంబంధం లేకుండా యజమాని ఏది చెబితే అది చేయాలనే పాత తరం ఆలోచనతో వాళ్లు ఏకీభవించడం లేదు. అందుకే అవసరమైతే రాజీనామాకూ వెనకాడటం లేదు. అలాగని యాజమాన్యంతో ఘర్షణ పడి ఉద్యోగ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అందుకే నేర్పుగా పని కానిచ్చుకోవడానికి కన్సల్టెన్సీల బాట పడుతున్నారు.‘‘రాజీనామా ఏజెన్సీలు జపాన్ సమాజం నుంచి పూర్తిగా కనుమరుగవ్వాలని మేం నిజాయితీగా కోరుకుంటున్నాం. ఉద్యోగులు తమ రాజీనామా గురించి నేరుగా బాస్‌తో మాట్లాడుకునే వాతావరణం వస్తే మేలు. కానీ మా క్లయింట్ల భయానక గాథలు వింటుంటే అది ఇప్పట్లో జరుగుతుందని అనిపించడం లేదు’’ – మోమూరీ కన్సల్టెనీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనా యువత వినూత్న నిరసన .. ఎందుకో తెలుసా?
బీజింగ్ : చైనా యువత నిరసన తెలపడంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్కడ చూసినా పక్షుల తరహాలో being a bird దుస్తులు ధరిస్తున్నారు. వాటిలాగే శబ్ధాలు చేస్తున్నారు. అందుకు ప్రభుత్వాలు తీసుకున్న మతిలేని చర్యే కారణమని తెలుస్తోంది. చైనాలో ‘996’ పని విధానాన్నిఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పని విధానంలో ఉద్యోగులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 9గంటల వరకు పనిచేయాలి. వారానికి 6 రోజులు పనిదినాలు. అయితే ఈ వర్క్ కల్చర్‌ను ఉద్యోగులు,యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పక్షుల తరహా దుస్తులు ధరిస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెక్కల్ని ధరించి చెట్లెక్కడం, కుర్చీ ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.ఇక పక్షుల తరహాలో ప్రవర్తించడం కొంచెం వింతగా ఉన్నప్పటికీ.. పనివిధానం, లేదంటే గంటల కొద్ది నిర్వహిస్తున్న స్టడీ అవర్స్ నుంచి తమకు విముక్తి కలిగించాలని, పక్షుల్లా తమకూ స్వేచ్ఛ కావాలనే ఉద్దేశ్యంతో ఈ చర్యలకు ఇలా ప్రవర్తిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల డిగ్రీని పూర్తి చేసుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు ఆందోళన చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. ర్యాట్‌రేస్‌లాంటి వర్క్ కల్చర్ , 996 పని విధానం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని వాపోతున్నారు. ఇక.. చైనాలోని యువత సోషల్ మీడియాలో దేశ పని సంస్కృతిపై తమ నిరాశను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో బాయి లాన్ అనే పదాన్ని ట్రెండ్ చేశారు. ఎన్బీయే బాస్కెట్ బాల్ వీడియో గేమ్‌లో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా బాస్కెట్ బాల్‌ను విసిరే పద్ధతి. ఈ కాన్సెప్ట్‌ను ఉపయోగించిన చైనా పౌరులు పని సంస్కృతిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తమగళాన్ని వినిపించారు. -
పనిచేసే చోట అలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఏం చేయాలంటే..
ఆఫీసు అంటేనే అక్కడ ఉన్న అందరితోనూ కలిసి పని చేయాలి. ఇలాంటప్పుడు ఎవ్వరితోనైనా కలిసి ఎలా పని చేయాలి? వర్కప్లేస్ ఎక్స్పర్ట్, స్పీకర్, రైటర్, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ పాడ్‌కాస్ట్ హోస్ట్ అమీ గలో కార్యాలయాలలో ఎలా ఉండాలో పుస్తకంగా మన ముందుకు తీసుకువచ్చారు. ‘గెటింగ్ ఎలాంగ్’ అనే ఈ బుక్ ఇప్పుడు పని ప్రదేశాల్లో ఉండే ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పని ప్రదేశాలలో ఎదుర్కొనే సమస్యలను అమీ గలో వివిధ రంగాల నుండి స్వయంగా సేకరించింది. ఈ యేడాది చదివి తెలుసుకోదగిన పుస్తకాలలో అమీ బుక్ ప్రముఖంగా నిలిచింది. వర్క్ ప్లేస్‌లో ఎలా ఉండాలో అమీ సేకరించిన విషయాలు, సూచించిన పరిష్కారాలు ఉద్యోగులందరికీ ఎంతగానో తోడ్పడుతున్నాయి. పనిలో సంఘర్షణ ఉంటుంది. పనిచేసే చోట సంబంధాలు కఠినంగా ఉంటాయి. వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు ఒత్తిడి ఉంటే మన సృజనాత్మకత, ఉత్పాదకత కూడా తగ్గుతుంది. స్పష్టంగా ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమూ తగ్గుతుంది. ఈ విషయాల గురించి రాత్రిపూట ఆందోళన చెందుతూ నిద్రలేని రాత్రులు గడపవచ్చు. ఈ ప్రవర్తన చేస్తున్న ఉద్యోగం వదులుకునేలా చేస్తుంది. చేస్తున్న పని నుండి బయటకు వచ్చేసి, ఆ తర్వాత పశ్చాత్తాప పడవచ్చు. మీటింగ్‌లో కళ్లు తిప్పడం, ఎగరేయడం, సహోద్యోగులపై విరుచుకుపడటం లేదా మనం మాట్లాడాల్సినప్పుడు మౌనంగా ఉండటం కూడా మనల్ని ఉద్యోగం నుంచి వేరు చేస్తాయి. చాలావరకు నవ్వుతూ, వేరే మార్గం లేనట్టుగా వ్యక్తులను భరిస్తుంటారు. సరైన పరిష్కారాలు తెలియక హానికరమైన ప్రవర్తనలను భరిస్తుంటారు. ఇక్కడ చూడాల్సింది మనలోని చిత్తశుద్ధి, కెరియర్ మాత్రమే అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. వర్క్‌ప్లేస్ ఎక్స్పర్ట్ అమీ ‘గెటింగ్ ఎలాంగ్’లో కష్టతరమైన సహోద్యోగులను గుర్తించి, ఇలా మన ముందుంచింది. ►సరైన బాస్ లేకపోవడం: వీరిపై ఉద్యోగుల్లో విశ్వాసం ఉండదు. ఫలితంగా ఏదో విధంగా మేనేజ్ చేస్తుంటారు. ఇలాంటి బాస్ తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే దాని గురించే ఎక్కువ ఆందోళన చెందుతారు. నిర్ణయాలు తీసుకోవడానికి, కట్టుబడి ఉండటానికి కష్టపడవచ్చు. ► నిరాశగా ఉండేవారు: ఇలాంటి వారితో సరైన ప్రోత్సాహం, కెరీర్లో పెరుగుదల ఉండదు. ► దూకుడుతనంగా ఉండటం: సహోద్యోగులు తమ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనే ధోరణి ఉండదు. తాము ఏదైనా తెలియజేయడానికి పరోక్ష పద్ధతులను ఉపయోగిస్తారు. ఎప్పుడూ ఇతరుల అవసరాలను తీర్చడానికి ఉన్నట్టు కనిపిస్తారు. ► అన్నీ తెలుసు అనే ఆలోచన: అత్యంత తెలివైన వారిగా చూపించుకోవడానికి తపన పడుతుంటారు. తగినంత సమాచారం లేకపోయినా, చెప్పేది తప్పు అని తెలిసినా తనదే కరెక్ట్ అనే ధోరణలో ఉంటారు. ► హింసించే వ్యక్తులతో ఎప్పుడూ ప్రమాదమే: సాధారణంగా ఒక సీనియర్ వ్యక్తి ఎన్నో ఆటుపోట్లను అధిగమిస్తేనే ఆ స్థాయికి చేరుకుంటారు. కానీ, అది మర్చిపోయి తన కింద ఉన్నవారితో అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. తన ప్రవర్తనతో ఇతరులు బాధపడుతున్నారా అనేది కూడా ఆలోచించరు. ►పక్షపాతంతో పనిచేసే సహోద్యోగి: పై స్థాయిలో ఉన్నవారికి ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు. వారిని పొగుడుతుంటాడు. ఏదైనా నీ కోసం చేస్తాను అంటారు. ► రాజకీయాలు చేసేవాళ్లు: ఈ వ్యక్తులు తమ కెరీర్‌ను ఏ విధంగానైనా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటారు. అందుకోసం అధికంగా ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు. అబద్ధాలు చెబుతుంటారు. అభద్రత పెంచే భయం నాయకత్వ పాత్రను పోషించాల్సిన సందర్భంలో అభద్రత పెరుగుతుందని పరిశోధనలో తేలింది. అధికారుల అతిపెద్ద భయం అసమర్థతే అని ఒక సర్వేలో తేలింది. సీనియర్ స్థానానికి ప్రమోట్ అయినప్పుడు పనితీరుపై ఒత్తిడి పెరగడం వల్ల ఇది సంభవించవచ్చు. కలిసిపోవడానికి ముఖ్యమైనవి ఎవరితోనైనా ఇట్టే కలిసిపోవడానికి సహాయపడేది ముందుగా మన దృష్టి కోణం. అందుకు ఎదుటివారికి ప్రపంచమంతా తెలియాల్సిన అవసరం లేదు. ముందుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎదుటివారి గురించి తప్పుగా అనుకోకూడదు. సహోద్యోగి ఎంత సన్నిహితమైనా మన స్థాయిని మర్చిపోకూడదు. నియంత్రణలపై దృష్టి పెట్టాలి. సహోద్యోగిని మార్చమని పై అధికారులకు చెప్పే బదులు మనం విభిన్నంగా ఏం చేయగలమో వాటిపైన దృష్టి పెట్టాలి. సహోద్యోగులతో నేరుగా పనులు చేసే అవకాశం లేకపోవచ్చు. ఇలాంటప్పుడు ఇ–మెయిల్ వంటి ఇతర మాధ్యమాలను ఉపయోగించుకోవాలి. ఒకరి దృక్పథాన్ని మరొకరు అర్ధం చేసుకోవాలి. లేదంటే, సహోద్యోగి ప్రవర్తన ఎందుకు అలా ఉంది? వారు సహకరించకపోతే నేను మాత్రమే ఎలా పరిష్కరించగలను? ప్రతిదీ ప్రయత్నించాను.. కానీ, ఇప్పుడు ఎలా? ... ఇలాంటి ప్రశ్నలు కొన్ని సార్లు భయానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. పనిలో కష్టతరమైన సంబంధాలను కొనసాగించడానికి, వ్యక్తుల మధ్య మంచి బంధాలను పెంపొందించడానికి గెటింగ్ ఎలాంగ్ ఒక మంచి గైడ్‌లా ఉపయోగపడుతుంది. టీమ్ వర్క్ బాస్ నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను గుర్తించాలి. సంవత్సరాంతపు లక్ష్యాలను చేధించడం, వర్క్‌పాలసీ గురించి నిరంతరం తెలుసుకోవాలి. ఉద్యోగులపై ఉన్న అభద్రతా భావాలను తొలగించగలగాలి. పనిని ఉమ్మడిగా చేయడానికి ప్రయత్నించాలి. పై అధికారి దగ్గర సాధ్యమైనంతవరకు ‘మేము’ వాక్యాన్నే జోడించాలి. ఉదాహరణకు..‘ఈ ప్రాజెక్ట్ విజయవంతం చేయడానికి ‘మేమంతా’ కష్టపడ్డాం. టీమ్‌గా ఇంకా బాగా కనిపించాలనే మేమంతా కోరుకుంటున్నాం’ అని విజయం సాధించినప్పుడు బాస్‌కు తెలియజేయాలి. పనిలో టీమ్ సహకారం ఎంత ఉందో తెలియజేయాలి. ఆఫీసులో స్నేహాలు ‘గెటింగ్ ఎలాంగ్ కోసం నేను న్యూరోసైన్స్, వ్యక్తుల హావభావాలలో చూపించే తెలివి, చర్చలు, మేనేజ్మెంట్ సైన్స్.. వంటి వివిధ అంశాల నుండి విషయ సేకరణ చేశాను. స్నేహితుల బృందాలు ఉంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. సపోర్టివ్‌గా ఉండే సహోద్యోగులతో ఉన్న వ్యక్తులు తక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటారు. సహోద్యోగులతో సన్నిహితంగా ఉండటం వల్ల సమాచారం, ఆలోచనలు పంచుకోవడం, ఆత్మవిశ్వాసం, సాధన పెరుగుతాయి. ఇతరులతో సామాజిక సంబంధాలు ఎలా ఉంటున్నాయో కూడా దీని ద్వారా అర్ధమవుతుంది. స్నేహాలు కెరీర్‌కు కూడా మంచివి. స్నేహితులుగా భావించే సహోద్యోగుల బృందాలు, వారి పనితీరుపై చేసే పరిశోధనలో ఎక్కువ ఉత్పాదకత వచ్చింది. – అమీ గలో -
ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు అసలు పని చేశామా లేదా అన్నది పాయింట్
వర్క్ కల్చర్‌పై ‘ఇన్ఫోసిస్’ కో–ఫౌండర్ నారాయణమూర్తి చేసిన కామెంట్ ‘70 హవర్స్ ఏ వీక్’ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రకరకాల కోణాలలో ఈ కామెంట్ గురించి చర్చోపచర్చల మాట ఎలా ఉన్నా స్టాండప్ కమెడియన్లు, మీమ్స్ సృష్టించే వాళ్లకు మాత్రం చేతినిండా పని దొరికింది. స్టాండప్ కమెడియన్ వివేక్ మురళీధరన్ వీడియోలో... ‘ఇప్పుడు మనం 70 హవర్స్ ఏ వీక్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం’ అంటూ సెల్ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ‘వారానికి 70 గంటలు పని చేయాలంటే’ అంటూ లెక్కలు వేయడం మొదలు పెడతాడు. రోజుకు, వారానికి, నెలకు ఎన్ని గంటలు పనిచేయాల్సి ఉంటుందో చెబుతాడు. టోటల్‌గా చెప్పాలంటే సంవత్సరంలో మనకంటూ మిగిలేది రెండు నెలలే. అందుకే తరచుగా ఈ సంవత్సరం తొందరగా గడిచినట్లు అనిపిస్తుంది అంటుంటాం’ అని వివేక్ అన్నప్పుడు ప్రేక్షకులు గట్టిగా నవ్వారు. ఒకరు ‘పోకిరి’ సినిమా ‘ఎప్పుడు వచ్చావన్నది కాదన్నయ్యా’ డైలాగుతో మీమ్ చేశారు... ‘ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదన్నయ్యా,,,, అసలు పనిచేశామా లేదా అన్నది పాయింట్’. -
‘ఇదే మా సంస్థ గొప్పతనం’.. ఒక్క ఫోటోతో అబాసుపాలైన దిగ్గజ కంపెనీ సీఈవో
ఎయిర్ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ వివాదంలో చిక్కుకున్నారు. తమ కంపెనీ వర్క్ కల్చర్‌పై గొప్పలు చెప్పారు. ఆపై అబాసు పాలయ్యారు? బాడీ మసాజ్ చేయించుకునే సమయంలో కూడా మేనేజ్మెంట్ సమావేశానికి హాజరయ్యేందుకు వీలు కల్పిస్తుందంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఫెర్నాండేజ్ షర్ట్ లేకుండా ఓ వైపు మసాజ్ చేయించుకుంటూ మరోవైపు ఆఫీస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం మనం చూడొచ్చు. వారంలో పని ఒత్తిడి, వెరానిటా యోసెఫిన్ సలహా మేరకు మసాజ్ చేయించుకుంటున్నాని క్యాప్షన్ ఇచ్చారు. మసాజ్ చేయించుకునేందుకు అనుమతి ఉందని.. ఇండోనేషియా, ఎయిర్ ఏషియా కల్చర్ ఇష్టపడతానని చెప్పారు. ఆఫోటోపై నెటిజన్స్ మండి పడుతున్నారు. పలువురు నెటిజన్లు ఇలాంటి చర్యల వల్ల ఎయిర్ ఏసియా ప్రతిష్టకు భంగం కలుగుతుంది. వెంటనే ఫెర్నాండేజ్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంటే.. సంస్థ గొప్పతనం గురించి ఇలా వివరించడం సరైంది కాదని అంటున్నారు. మొత్తానికి ఈ ఫోటోలు ఏవియేషన్ విభాగంలో కాక రేపుతుండగా.. ఈ ఫోటోలు ఫెర్నాండెజ్ షేర్ చేశారా? లేదంటే ఈజీ మనీ కోసం సైబర్ నేరస్తులు ఇలా ఫోటోల్ని మార్ఫింగ్ చేసి లింక్డిన్లో పోస్ట్ చేశారా? అని తెలియాల్సి ఉంది. -
మనిషికి పని లేని అభివృద్ధా?
ఇటీవలి సంవత్సరాలలో ఒక వైపరీత్యం కనిపిస్తున్నది. భారతదేశం రోజురోజుకీ ధనిక దేశంగా మారుతున్నది. కానీ అదే దామాషాలో ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. జాతీయాదాయం పెరిగితే, ఉద్యోగ అవకాశాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని భావిస్తాం. కానీ అలా జరగడం లేదు. కోట్లాది మంది యువకులు నిరుద్యోగులుగా రోడ్ల మీదే ఉన్నారు. అందుకే వందల ఉద్యోగాలు ఉంటే, వాటికోసం లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. దీనికి కారణం – వేగంగా పెరిగిన యాంత్రీకరణ. దినదినాభివృద్ధి చెందుతున్న యాంత్రీకరణ, సాంకేతికత మనకు తెలియకుండానే మనుషుల్ని మింగేస్తున్నది. మనుషులతో మనుషుల కోసం అభివృద్ధి కాకుండా, పెట్టుబడిదారుల కోసం యంత్రాలతో అభివృద్ధి సాగుతున్నది. ‘‘ఉద్యోగ, ఉపాధి కల్పన, అసమానతల తొలగింపు మీద భారత ప్రభుత్వం దృష్టి సారించాలి. సామాజిక, ఉద్యోగ భద్రత గురించిన విధానాలను పటిష్ఠ పరచాలి. నైపుణ్యంతో కూడిన ఉత్పాదక పురోగతిని సాధించాలి. కోవిడ్‌తో ఏర్పడిన ఇంకా అనేక పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయాలను మరింత లోతుగా ఆలోచించాలి.’’ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ హంగ్బో సున్నితంగా చేసిన హెచ్చరిక ఇది. ఇటీవలి సంవత్సరాలలో ఒక వైపరీత్యం కనిపిస్తున్నది. భారత దేశం రోజురోజుకీ ధనిక దేశంగా మారుతున్నది. స్థూల జాతీయా దాయం, తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయి. కానీ అదే దామా షాలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. పైగా తగ్గు తున్నాయి. భారత్‌లో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయనీ, నిరుపేద, అణగారిన వర్గాల ప్రజలు రోజు రోజుకీ ఆర్థిక ఇబ్బందు లకు గురవుతున్నారనీ ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ హంగ్బో చెప్పిన మాటలు అక్షర సత్యాలు. స్థూల జాతీయాదాయం, అంటే మన దేశంలో పోగవుతున్న సంపదలో తగ్గుదల లేదు. ఏడాదికేడాది ఆ పెరుగుదల కనిపిస్తూనే ఉన్నది. అదే సమయంలో నిరుద్యోగం కూడా ఆకాశాన్నంటుతున్నది. భారతదేశ ఆర్థికాభివృద్ధిలో చాలా హెచ్చుతగ్గులు ఉన్నాయి. 1991కి ముందు ప్రభుత్వం అనుసరించిన విధానాలను తిరస్కరించి, ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేశారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకర ణల ద్వారా ఆర్థిక వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తులకు, కంపెనీలకు అందు బాటులోకి తెచ్చారు. దాని తరువాత భారత స్థూల జాతీయాదా యాలు పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. 1960–70 దశకంలో జీడీపీ వృద్ధి రేటు 3–5 శాతం మాత్రమే ఉండింది. అయితే నిరుద్యో గితా రేటు 5 శాతానికి మించలేదు. జీడీపీ వృద్ధి రేటు, నిరుద్యోగితా రేటును పోల్చి చూస్తే మన ఆర్థిక వ్యవస్థ పనితీరు అర్థం కాగలదు. 1999లో జీడీపీ వృద్ధిరేటు 8.85 ఉంటే, నిరుద్యోగితా రేటు 5.74 ఉండింది. 2003లో జీడీపీ వృద్ధి రేటు 7.5 ఉంటే, నిరుద్యోగితా రేటు 5.64 ఉండింది. 2021లో జీడీపీ వృద్ధిరేటును 8.95 గా గుర్తించారు. అయితే నిరుద్యోగితా రేటు కూడా అదే స్థాయిలో పెరిగింది. 2021లో ఇది 8.7 శాతంగా నమోదైంది. నిజానికి ఉత్పాదకత పెరిగి, జాతీయాదాయం పెరిగితే, ఉద్యోగ అవ కాశాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని భావిస్తాం. కానీ అలా జరగలేదు. దీనికి కారణం ఏమిటనే ప్రశ్న మనలాంటి సామాన్యులకు రావడం సహజం. దీనికి ప్రధానమైన ఒక కారణం, ప్రైవేట్ రంగం విస్తృతంగా జడలు విప్పడం. ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగాలను కబళిస్తూ వస్తోన్న ప్రైవేటు వ్యవస్థ సమాజం లోతుల నుంచీ సహజత్వాన్నీ, సామాజిక తత్వాన్నీ, సమైక్యతా నాదాన్నీ పెకిలిస్తూ వస్తున్నది. ఎవరైనా ఒక పెట్టుబడిదారుడు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి చేయాలను కోవడవం సహజం. ఇక్కడ మనిషి, కార్మికుడు కేవలం ఒక సరుకు లాంటివాడు. ఎక్కువ మందిని ఒక పరిశ్రమలో పెట్టుకొని తక్కువ ఉత్పత్తి జరుగుతుంటే అతడు దానిని కొనసాగించడు. మనిషి కేంద్రంగా అభివృద్ధి, ఉత్పత్తి అనే మాటలు వ్యాపారికి అనవసరం. ఏదైనా యాంత్రిక, సాంకేతిక పరిజ్ఞానంతో అత్యధిక అభివృద్ధి సాధించే అవకాశం ఉంటే కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం లేదంటే, అదనంగా తీసుకోకపోవడం రివాజు. ఇదే కారణం వల్ల కార్మికులు, ఉద్యోగుల అవసరం లేకుండా పోతోంది. ఇప్పుడు ప్రైవేటు రంగంలోనే కాదు, ప్రభుత్వ రంగ సంస్థల్లో, చివరకు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సిబ్బంది నియామకాలు తగ్గుతూ వస్తుండడానికి ఇదే కారణం. 2000 సంవత్సరం తరువాత పెరిగిన యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానం మనిషి అవసరాన్ని తోసిరాజంటున్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే, సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం మారుతూనే›ఉంటుంది. ఈ రోజు వందమంది చేసే పనిని ఒక్కరు చేయగలిగితే, మరో సంవత్సరానికి వేయిమంది చేసే పనిని ఒక్కరే చేయగలుగుతున్నారు. అంటే ఆ స్థాయిలో ఉద్యో గుల, కార్మికుల అవసరం ఉత్పాదకతలో తగ్గిపోతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇది సమాజ మనుగడకు అత్యంత ప్రమాదకరం. మనం నిత్యం చూస్తున్న వ్యవసాయం, నిర్మాణ రంగాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఉదాహరణకు వరి పంటలో గతంలో అడు గడుగునా కూలీల శ్రమ అవసరమయ్యేది. ఈ రోజు దున్నడం కోసం ట్రాక్టర్లు, కోతకు మిషన్లు వచ్చాయి. చివరకు ఆడవాళ్లకు ఏకైక ఉపాధినిచ్చే నాట్లు, కలుపులు తీయడానికి కూడా చిన్న చిన్న మిషన్లు వచ్చాయి. అవి ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. కానీ ఇప్పటికే వరి పంటలో 70 శాతం వరకు కూలీల ప్రమేయం తగ్గింది. మిగతా 30 శాతం త్వరలో కనుమరుగు కానున్నది. అదేవిధంగా ప్రాజెక్టులు, భవన నిర్మాణ రంగంలో వచ్చిన యాంత్రీకరణతో ప్రాజెక్టులు అత్యంత వేగంగా పూర్తి అవుతున్నాయి. కానీ మనుషుల, కార్మికుల ప్రమేయం లేని అభివృద్ధి కనపడుతున్నది. తక్కువ మందికి ఎక్కువ నైపుణ్యం అందించే ఒక ప్రయత్నం సాగుతున్నది. అందుకే సాంకేతిక, నైపుణ్యాల విద్యలు ఈ దేశంలో కొద్దిమందికే అందుబాటులో ఉన్నాయి. విద్యావ్యవస్థలో సాంకేతిక తను, నైపుణ్యాల శిక్షణలను అన్ని వర్గాల విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం అనుకోవడం లేదు. దీనిలో ఈ దేశంలోని సామాజిక, ఆర్థిక అసమానతలు మళ్ళీ ప్రస్ఫుటంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పరి శ్రమలకు, సేవారంగాలకు, వ్యవసాయరంగాలకు అవసరమైన సాంకే తిక విద్యను ప్రభుత్వ ఆధీనంలోని విద్యాసంస్థలు అందించడం లేదు. ఒకవేళ ఉన్నా వాటి సంఖ్య చాలా తక్కువ. వృత్తి నైపుణ్య విద్య, సాంకే తిక విద్యల కోసం ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి, వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అందులో చేరాలనుకుంటే, వాటికి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది కొన్ని వర్గాలకు ప్రస్తుత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందు కోవడం అసాధ్యంగా మారుస్తున్నది. అందుకే ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ హంగ్బో ఈ దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో అణగారిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దేశం ఆర్థికాభివృద్ధిలో దూసుకు పోతుంటే, కోట్లాది మంది భారతీయ యువకులు నిరుద్యోగులుగా రోడ్ల మీదే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఉద్యోగ పరీక్షల్లో వందల ఉద్యో గాలుంటే, లక్షల మంది ఆ పరీక్షలు రాస్తున్నారు. అంతిమంగా ఒక విషయం చెప్పాలని ఉంది. ప్రజల ఓట్లతో గెలిచి, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాలు చాలా ముఖ్య మైన విషయాన్ని మర్చిపోతున్నాయి. లేదా మర్చిపోతున్నట్టు నటిస్తు న్నాయి. మానవ సమాజం మొదటి నుంచి శ్రమ ద్వారానే అభివృద్ధి చెందుతూ వచ్చింది. అది మేథోశ్రమ కావచ్చు, శారీరక శ్రమ కావచ్చు. ఇప్పుడు నూటికి 70 శాతం మంది నిరుద్యోగంలో గానీ, అర్ధ నిరు ద్యోగంలో గానీ జీవిస్తున్నారు. ఎవ్వరూ సంతృప్తికరంగా లేరు. దిన దినాభివృద్ధి చెందుతున్న యాంత్రీకరణ, సాంకేతికత మనకు తెలియ కుండానే మనుషుల్ని మింగేస్తున్నది. మనుషులతో మనుషుల కోసం అభివృద్ధి కాకుండా, పెట్టుబడిదారుల కోసం యంత్రాలతో అభివృద్ధి సాగుతున్నది. ఇప్పటికైనా ఈ దేశంలోని యువత తమ భవిష్యత్ గురించి ఆలోచించుకోవాలి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై తమ గళాన్ని విప్పాలి. లేదంటే ఇక్కడ మనుషులకు బదులుగా సాంకేతిక వస్తువులు మాత్రమే మిగులుతాయి. అంతిమంగా మనిషి నిర్జీవంగా మారిపోతాడు. అసలు మనిషన్నవాడే మాయమైపోతాడు. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 81063 22077 -
ఆఫీసులో అరగంట నిద్రపోవచ్చు.. ఆ కంపెనీ వినూత్న నిర్ణయం
ఉద్యోగుల పనితీరు సామర్థ్యం పెంచేందుకు అనేక కంపెనీలు హైబ్రిడ్ పని విధానానికి జైకొడుతున్నాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ఇంకో అడుగు ముందుకేసి వినూత్న నిర్ణయం తీసుకుంది. పని సమయంలో అరగంట పాడు నిద్రపోవచ్చంటూ ఉద్యోగులకు అవకాశం కల్పించింది. వేక్లిఫ్ట్లో స్లీపింగ్ బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్ సంస్థ పరుపుల తయారీ బిజినెస్‌లో ఉంది. దీని ఫౌండర్ చైతన్య రామలింగేగౌడ. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుని కొంత కాలం నాసాలో పని చేశారు. గత ఆరేళ్ల నుంచి ఉద్యోగుల పనితీరును గమనించి చైతన్య.. వారి పనితీరు మెరుగు పరిచేంందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 25 నిమిషాలు నిద్రపోతే అరగంట పాటు ఉద్యోగులకు నిద్ర పోవడానికి అవకాశం కల్పించడంపై చైతన్య మాట్లాడుతూ.. నాసా అధ్యయనాల ప్రకారం మధ్యాహ్నం వేళ 25 నిమిషాల పాటు చిన్న కునుకు తీస్తే ఉద్యోగుల పని సామర్థ్యం 33 శాతం పెరుగుతుందని తేలినట్టు వివరించారు. అంతేకాదు అనవసరపు ఒత్తిడి కూడా తగ్గుతుందని దాని వల్ల పనిలో ఉత్తమ ఫలితాలు వస్తాయంటున్నాడు. మధ్యాహ్నం నిద్ర విషయంలో ఇప్పటికే నిర్ణయం ఆలస్యమైనట్లు వెల్లడించాడు. అందరి దృష్టి ఇటే వేక్లిఫ్ట్కు చెందిన ఉద్యోగులకు ప్రతీ రోజు మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 2:30 గంటల వరకు కునుకు తీసేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన ఉద్యోగులకు ఈమెయిళ్లు పంపారు. దీంతో ఒక్కసారిగా మధ్యాహ్నం నిద్ర చర్చకు వచ్చింది. మిగిలిన కంపెనీలు, ఉద్యోగులు కూడా ఈ విధానాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. చదవండి: ఐటీ కంపెనీ ఆఫర్: రండి బాబు రండి పెళ్లి సంబంధాలు చూస్తాం, శాలరీలు పెంచుతాం! -
ఒళ్లంతా కనిపించేలా ఏంటా పచ్చబొట్లు ! ఇది కరెక్టేనా?
అన్ని రంగాల్లో మగవాళ్లతో సమానంగా మహిళలు రాణిస్తున్నా.. పూర్తి సమానత్వం ఇంకా రాలేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇప్పటికీ కొన్ని విషయాల్లో పాత పద్దతులు పాటించడాన్నే సమర్థిస్తున్నారు. కొత్తగా ఎవరైనా ప్రయత్నిస్తే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇలాంటి విమర్శలు, సూటిపోటీ మాటలతో ఇబ్బంది పడుతున్న ఓ బిజినెస్ విమన్ ఇటీవల వాటి నుంచి విముక్తి పొందింది. తన జీవితంలో ఎదురైన అనుభవాలను ఇటీవల ఆమె తన లింక్డ్ఇన్లో పంచుకుంది. ఆమెకు ఎదురైన అనుభవాలు, వర్క్‌ప్లేస్‌లో కల్చర్ తదితర అంశాలు ఇప్పుడు బిజినెస్ వరల్డ్‌లో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలోని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ మేనేజింగ్ కంపెనీల్లో ఒకటైన ఎవల్యూషన్ క్యాపిటల్ పార్టనర్ సంస్థలో జెస్సికా హాంజీ లియోనార్డ్ అనే మహిళ ఇటీవల భాగస్వామిగా చేరింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఎంతో బెరుకుగా ఆమె వాళ్ల బాస్ రూమ్‌లోకి అడుగు పెట్టింది. టాటాల చుట్టే విమర్శలు జెస్సికా హాంజీ లియోనార్డ్‌కి పచ్చబొట్లు (టాటూస్) అంటే ఇష్టం. మణికట్టు నుంచి భుజాలు, మెడ వరకు అనేక డిజైన్లలో పచ్చబొట్లు వేయించుకుంది. అయితే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ హోదాలో అలా పచ్చబొట్లు పొడిపించుకున్నందుకు ఆమెకు తోటి ఉద్యోగుల నుంచి ఛీత్కారాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులే ఆమె పట్ల కఠినమైన వ్యాఖ్యలు చేసేవారు. దీంతో ఆ పచ్చబొట్లు కనిపించకుండా ఆమె పొడుగు చేతులు ఉండే దుస్తులు ధరించాల్సి వచ్చేది. మెడ, చెవుల భాగంలో టాటూలు కనిపించకుండా హెయిర్‌స్టైల్‌ను మార్చుకునేది. ఇలాంటి చర్యలతో రణంగా సమ్మర్లో చాలా ఇబ్బందులు పడేది జెస్సికా. ఇంకా దాచలేను టాటూలు ఆమె పాలిట శత్రువులు కావడంతో అనేక కంపెనీలు మారుతూ వచ్చింది. తాజాగా ఎవల్యూషన్ క్యాపిటల్‌లో చేరింది. దీంతో వెబ్సైట్లో ఆమె ఫోటో, ఇతర వివరాలు వెల్లడించాల్సిన అవసరం వచ్చింది. కొత్త ఆఫీసులో టాటూలతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంది. అందుకే బాస్ గదిలోకి అడుగు పెట్టిన జెస్సికా.. భయంభయంగానే తన ఒంటిపై ఉన్న టాటూల సంగతి చెప్పింది. ఇంకా వాటిని దాచి పెడుతూ ఉండలేనంది. ఆఫిషియల్ వెబ్సైట్లో జాకెట్(కోట్)తో కూడిన ఫోటోను అప్లోడ్ చేస్తానని, తన పర్సనల్ లింక్డ్ఇన్లో స్లీవ్‌లెస్ డ్రెస్‌తో టాటూలు కనిపించేలా ఉన్న ఫోటో అప్లోడ్ చేస్తానంటూ రిక్వెస్ట్ చేసింది. బాస్ ఎలా రియాక్ట్ అవుతాడో అనే టెన్షన్‌తో ఆమెలో పెరిగిపోతోంది. లౌడ్ అండ్ ప్రౌడ్ జెస్సికా రిక్వెస్ట్‌ని విన్న వాళ్ల బాస్ సానుకూలంగా స్పందించారు. ఒక్క లింక్డ్ఇన్లోనే ఎందుకు తమ సంస్థకు సంబంధించిన అఫిషీయల్ వెబ్సైట్లో కూడా టాటూ కనిపించేలా ఉన్న ఫోటోనే అప్లోడ్ చేసుకోమన్నారు. ఈ విషయంలో గోప్యత అనవసరమని.. రెండు చోట్ల స్లీవ్‌లెస్‌తో టాటూలు కనిపించేలా ఫోటోలు అప్లోడ్ చేయ్ విత్ లౌడ్ అండ్ ప్రౌడ్ అంటూ పర్మిషన్ ఇచ్చాడు. పెర్ఫార్మెన్స్ ముఖ్యం నేను కోటు ధరించానా ? స్లీవ్‌లెస్‌లో ఉన్నానా ? నా ఒంటిపై టాటూలు ఉన్నాయా? అనేవి అప్రాధాన్య విషయాలు. నేను ఎలా పని చేస్తున్నాను. నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. వృత్తి పట్ల అంకితభావంతో ఉన్నానా లేనా అనేవే పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇంత కాలం అలా జరగలేదు. నా వృత్తిగత జీవితంలో నా పెర్ఫార్మెన్స్ కంటే టాటూల మీదే ఎక్కువ చర్చ జరిగింది. దీంతో నాకెంతో ఇష్టమైన టాటూలు అంటేనే భయం వేసే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఫ్రీ అయ్యాను. నా మీద ఉన్న ఒత్తిడి తొలగిపోయింది. ఇప్పుడు నేను రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాను అంటూ జెస్సికా లింక్డ్ఇన్లో రాసుకొచ్చింది. చదవండి: దేశంలో మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్న సంస్థలు ఇవే -
పనిసంస్కృతి లేకే వెనకబడ్డాం
న్యూఢిల్లీ: గతంలో ఘనమైన పేర్లున్న నేతలు పాలించినప్పటికీ సరైన పని సంస్కృతి లేని కారణంగానే దేశం వెనుకబాటుకు గురైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. దైనిక్ జాగరణ్ మీడియా గ్రూప్ శుక్రవారం నిర్వహించిన ‘జాగరణ్ ఫోరం’లో ఆయన ప్రసంగించారు. ‘ఘనమైన పేర్లున్న నేతలు గతంలో అధికారం చేపట్టారు. కానీ, దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపలేకపోయారు’ అని నెహ్రూ–గాంధీ కుటుంబం గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘గత నాలుగేళ్లలో సంభవించిన మార్పును మీకై మీరే చూశారు. గతంలో ఇలా జరగలేదు. ప్రజలు, అధికారులు, యంత్రాంగం అప్పటికీ ఇప్పటికీ మారనప్పటికీ పని సంస్కృతి లేని కారణంగానే దేశం వెనుకబడింది. గత పాలకులు పేదరికాన్ని పారదోలి ఉన్నట్లయితే గరీబీ హఠావో నినాదాన్ని ఎందుకు ఇచ్చి ఉండేవారు? అది కచ్చితంగా ఓటు బ్యాంకు రాజకీయమే’ అని ప్రధాని అన్నారు. నిరుపేదలకు కనీస అవసరాలైన మరుగుదొడ్లు, వంటగ్యాస్, విద్యుత్, బ్యాంకు అకౌంట్, సమకూర్చి ఉంటే వారు తమంతట తామే పేదరికం నుంచి బయటపడి ఉండేవాళ్లు అని ఆయన తెలిపారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో భారీ లక్ష్యాలను సాధించేలా పెద్ద నిర్ణయాలు తీసుకునే సాహసం తమ ప్రభుత్వానికి ఉందని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కంటే తమ ప్రభుత్వంలోనే పన్ను చెల్లింపు దారులు, జీఎస్టీ ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పెరిగారన్నారు. పారిపోయిన ఆర్థిక మోసగాళ్లను తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
డేంజర్ జోన్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందుకు అనుగుణంగా ఓట్లు కురిపించే పథకాలకు మరింత పదును పెడుతోంది. తద్వారా గులాబీ పార్టీకి ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్నా.. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, వారి అనుచరులు వ్యవహరించే తీరు మైనస్‌గా మారుతోందని గుర్తించారు. అంతర్గత సర్వేల ద్వారా ఇవి బయట పడుతుండడంతో అధికార పార్టీలో గుబులు రేపుతోంది. పాలమూరు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేల్లో సగంమంది డేంజర్ జోన్లో ఉన్నారని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆ కొద్ది మందిని స్వయంగా గులాబీ దళపతి సుతిమెత్తగా హెచ్చరించినట్లు సమాచారం. ఇకనైనా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది. ఏడు నుంచి తొమ్మిది.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ రానున్న సాధారణ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుపొందేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల సందర్భంగా రాష్ట్రమంతా గులాబీ పార్టీకి సానుకూల పవనాలు బలంగా వీచినా ఒక పార్లమెంంట్, ఏడు అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ నుంచి గెలుపొందిన నారాయణపేట ఎస్.రాజేందర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలం తొమ్మిదికి చేరింది. పనితీరుపై ఆరా ఇంతకాలం ఎమ్మెల్యే పనితీరుపై పెద్దగా దృష్టి సారించని సీఎం కేసీఆర్ ఇటీవల తరచుగా అంతర్గత సర్వేలు చేయిస్తున్నట్లు తెలిసింది.. ఇప్పటికే పలు సర్వేల ఫలితాలను కూడా బహిర్గతం చేశారు. తాజాగా చేయించిన సర్వేలో ఉమ్మడి జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేల పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నట్లు తేలిందని సమాచారం. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు, మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ముగ్గురి పరిస్థితి ‘డేంజర్ జోన్’లో ఉన్నట్లు గుర్తించారని చెబుతున్నారు. డేంజర్ జోన్ ఉన్నట్లు చెబుతున్న ఓ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు తన నియోజకవర్గ కేంద్రంలో కేవలం ఒక్కసారి మాత్రమే రాత్రివేళ విడిది చేశారట. ఇలాంటి పరిస్థితులో నియోజకవర్గ ప్రజలు ఎలా విశ్వసిస్తారని సీఎం కేసీఆర్ గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ఇదే మాదిరిగా మిగతా ఎమ్మెల్యేల బలహీనతలను స్వయంగా సీఎం కేసీఆర్ వారికే నేరుగా చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలపై.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, మెజార్టీ ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల సాను కూలత వ్యక్తమైందని సర్వేల్లో వెల్లడవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, గతంలో మాదిరిగా కాకుండా రానున్న ఎన్నికల్లో పాల మూరు ప్రాంతంలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను దాదాపు క్లీన్ స్వీప్ చేయాలని అధినేత భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకోసం రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు ఉమ్మడి పాలమూరు పట్ల ప్రత్యేకశ్రద్ధ చూపుతున్న వైనా న్ని ప్రస్తావిస్తున్నారు. అయితే పార్టీకి సానుకూల పవనాలు బలంగా ఉన్నా.. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల పనితీరు పార్టీకి ముప్పుగా మారే ప్రమాదం ఉం దని సర్వేల ద్వారా వెల్లడైందట. చాలా మంది ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సామాన్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడకపోతే ‘ప్రత్యామ్నాయ’ మార్గాలు ఎంచుకోవాలనే యోచనలోగులాబీ బాస్ ఉన్నట్లు సమాచా రం. ఇప్పటికే రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతల తో పాటు ద్వితీయశ్రేణి నాయకులు భారీ సంఖ్య లో కారె క్కారు. పార్టీ తరఫున ఎవరిని నిలి పితే విజయం తథ్యమనే దిశగా పార్టీ అధిష్టానం యో చిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. -
ఫేస్ బుక్ పై మహిళ సంచలన ఆరోపణలు
మంచి జీతం, ఉచిత భోజనం, అన్నింటికీ మించి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలో ఉద్యోగం... ఫేస్ బుక్ లో జాబ్ అనగానే మదిలో మెదిలే భావన ఇది. సోషల్ మీడియా దిగ్గజ సంస్థలో పని వాతావరణం ఊహించిన దాని కంటే భిన్నంగా ఉంటుందని ఫేస్ బుక్ మాజీ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. కోపం, నిరుత్సాహం, మాట్లాడడానికి విల్లేని విధంగా ఆఫీస్ వాతావరణం ఉంటుందని ఫేస్ బుక్ ట్రెండింగ్ టీమ్ లో కాంట్రాక్టర్ గా పనిచేసిన మహిళా ఒకరు వెల్లడించారు. న్యూస్ క్యూరేటర్ గా పనిచేసిన ఆమె ఫేస్ బుక్ కార్యాలయంలోని పూర్ మేనేజ్ మెంట్ గురించి దిగ్బ్రాంతికర విషయాలు చెప్పింది. భయం, పక్షపాతం, లింగ వివక్ష కారణంగా 2014 నుంచి 40 నుంచి 50 మంది ఉండే ట్రెండింగ్ టీమ్ నుంచి 15 మంది రాజీనామా చేసి వెళ్లిపోయారని తెలిపింది. ట్రెండింగ్ టీమ్ లో 10 మంది మహిళలు ఉండేవారని, కానీ ఎక్కువగా మగాళ్లనే ప్రోత్సహిస్తుంటారని 'గార్డియన్' పత్రికతో చెప్పారు. మాట్లాడేందుకు మహిళలకు అవకాశాలు తక్కువని, మగాళ్లు మాట్లాడుతున్నప్పుడు తామంతా నోరు తెరవడానికి వీల్లేదన్నారు. మహిళా ఉద్యోగులను మేనేజర్లు, ఎడిటర్లు వేధిస్తుంటారని చెప్పారు. అయితే రాజకీయ పక్షపాతం లేదని వెల్లడించారు. ట్విటర్ వాడకుండా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంటారని వెల్లడించారు. సరైన షెడ్యూలు, సమాచారం ఇవ్వకుండానే టార్గెట్ సాధన కోసం ఒత్తిడి తెస్తారన్నారు. ఫేస్ బుక్ ఇంటర్నల్ టీమ్స్ చెప్పినట్టే నడుచుకోవాలని, ఎదురు అసలు వీల్లేదన్నారు. మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణలపై ఫేస్ బుక్ స్పందించింది. ఆమె లేవనెత్తిన అంశాలు చాలా ప్రధానమైనవని, దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది.