
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇంగ్లండ్‌లో కరోనా వైరస్ మహమ్మారి రెండో దశ విజంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం రోజుకు లక్ష కేసులు కొత్తగా నమోదవుతుండగా, ప్రతి తొమ్మిది రోజులకు ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన వచ్చే వారానికి రోజుకు రెండు లక్షల చొప్పున కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. రెండో దశలో కరోనా వైరస్ బారిన పడి కనీసం 85 వేల మంది మరణించే అవకాశం ఉంది. రెండో దశ కరోనాను కట్టడి చేయడం కోసం మొదటి దశకన్నా పగడ్బంధీగా ‘లాక్‌డౌన్’ ఆంక్షలను అమలు చేయాల్సి ఉంది’ అంటూ కరోనా విజంభణపై నియమించిన సేజ్ కమిటీ గత రాత్రి ఇంగ్లండ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులతో కూడిన సేజ్ కమిటీ అక్టోబర్ 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా మహమ్మారి రెండో దశ విజంభణ ప్రారంభమైనట్లు తెల్సింది. మరో దఫా ‘లాక్‌డౌన్’గానీ, ఆంక్షలనుగానీ విధించాలని దేశ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై శాస్త్రవేత్తల ఒత్తిడి పెరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల చివరి నాటికి మతుల సంఖ్య కూడా గణనీయంగా పెరగుతుందని, రోజుకు 800 మంది చొప్పున మరణించే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. కరోనా వైరస్ మొదటి దశ విజంభణలో దాదాపు 40 వేల మంది మరణించారు. రెండు దశలో దాదాపు 85 వేల మంది మరణించే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేశారు. అంటే, రెండింతలకుపైగా. దేశవ్యాప్తంగా 86 వేల మంది శాంపిల్స్‌ను పరిశీలించడం ద్వారా వైరస్ రెండో దశ కొనసాగుతున్నట్లు వారు నిర్ధారణకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment