సెమెల్ సెంటర్క్‌తో బోన్‌కక్, ఆసుపత్రి బయట బోన్‌కక్
ఇస్తాంబుల్ : కుక్కల విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. యజమానుల కోసం ప్రాణాలిచ్చిన కుక్కలు కోకొల్లలు. మరణించిన యజమాని కోసం కొన్ని నెలల పాటు రైల్వే స్టేషన్ బయట ఎదురుచూసి ప్రాణాలు వదిలిన జపాన్‌కు చెందిన ‘‘హచికో’’ ఓ అద్భుతం. అచ్చం అలాంటిది కాకపోయినా.. కొంచెం అటుఇటు సంఘటన టర్కీలో జరిగింది. ఆపరేషన్ కోసం హాస్పిటల్‌లో చేరిన యజమాని కోసం ఓ కుక్క ఆరు రోజుల పాటు హాస్పిటల్ బయట ఎదురుచూసింది. వివరాలు.. ట్రాబ్జాన్ సిటీకి చెందిన 68 ఏళ్ల సెమెల్ సెంటర్క్ కొన్నిరోజుల క్రితం బ్రేయిన్ సర్జరీ చేయించుకోవటానికి అక్కడి హాస్పిటల్‌లో చేరాడు. అతడి కుక్క బోన్‌కక్ వారం రోజుల పాటు హాస్పిటల్ బయట ఎదురుచూసింది. (ఇలాంటి ఫ్యామిలీని ఎక్కడా చూసుండరు)
హాస్పిటల్ సిబ్బంది దానికి తిండి, నీళ్లు అందించి సహాయం చేశారు. సెమెల్ కూతురు బోన్‌కక్‌ను ఇంటికి తీసుకెళ్లినప్పటికి అది ఆవెంటనే హాస్పిటల్‌కు తిరిగొచ్చేది. ఏదైతేనేం ఆరవ రోజు యజమానిని కలుసుకోగలిగింది. అతడు హాస్పిటల్‌ను వదిలి ఇంటికి వెళుతున్న సమయంలో వీల్ ఛైర్ వెంట పరిగెడుతూ, అటు ఇటు గెంతుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై సెమెల్ మాట్లాడుతూ కుక్కలకు మనుషులకు మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేశారు. అవి మనల్ని ఎంతో సంతోషపెడతాయని అన్నారు.
finaly, they came together. 😊 pic.twitter.com/qP12L3st9M
— the istanbulist (@istanbulism) January 19, 2021
Comments
Please login to add a commentAdd a comment