
లండన్: భూమిపై ఉన్న మంచు కరిగే వేగం నానాటికీ పెరిగిపోతోంది. 1994-2017 మధ్య 28 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయిందని తాజా అధ్యయనం వెల్లడించింది. గత మూడు దశాబ్ఞాలలో పోలిస్తే భూమిపై ఉన్న మంచు కరగే వేగం పెరిగిందని లండన్ కి చెందిన లీడ్స్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో తేలింది.1990లలో సంవత్సరానికి 0.8 ట్రిలియన్ టన్నుల మేర మంచు కరిగేదని, 2017నాటికి ఏటా కరిగే మంచు 1.3 ట్రిలియన్ టన్నులకు చేరిందని ఈ అధ్యయనం తెలిపింది. శాటిలైట్ డేటా ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు.(చదవండి: ఎలోన్ మస్క్ 'స్పేస్‌ఎక్స్' సరికొత్త రికార్డ్!)
గత 23 సంవత్సరాల్లో పరిశీలిస్తే మంచు కరిగే వేగం 65 శాతం పేరిగిందని తేలింది. అంటార్కిటికా, గ్రీన్‌లాండ్‌లో ఐస్ షీట్లు కరిగిపోవడంతో మంచు కరిగే వేగం పెరిగినట్లు వివరించింది. ఈ సర్వేలో 2.15 లక్షల గ్లేసియర్లను అధ్యయనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మంచు వేగంగా కరగడం కారణంగా సముద్ర మట్టం పెరిగి తీరప్రాంతలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే వన్యప్రాణులకు నివాసంగా ఉండే సహజ ఆవాసాలను తుడిచిపెట్టే ప్రమాదం ఉంది అని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. పర్యావరణ పతనానికి సంబంధించి శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే వేగంగా దారుణ పరిణామాలన్నీ క్రమంగా ప్రత్యక్షమవుతున్నాయి. అధ్యయనంలో వాతావరణంలో, మహాసముద్రాలలో ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా మంచు వేగంగా కరిగిపోతుందని తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment