Ice burgh
-
National Snow and Ice Data Center: అంటార్కిటికాలో కరిగిపోతున్న మంచు
వాషింగ్టన్: ఉత్తరార్ధ గోళంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో వడగాలులు వీచాయి. ఫలితంగా అంటార్కిటికా ఖండంలో పెద్ద ఎత్తున మంచు కరిగిపోయింది. ఈసారి అక్కడ రికార్డు స్థాయిలో మంచు ఫలకలు కరిగినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. వాస్తవానికి అంటార్కికాలో వేసవి కాలంలో మంచు కరిగి, శీతాకాలంలో మళ్లీ భారీ మంచు ఫలకలు ఏర్పడుతుంటాయి. కానీ, ఈసారి అలా జరగలేదు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో హిమం ఉంది. నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ (ఎన్ఎస్ఐడీసీ) గణాంకాల ప్రకారం.. అంటార్కిటికాలో 2022 శీతాకాలంతో పోలిస్తే ఇప్పుడు 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగిపోయింది. అలాగే 1981–2010 మధ్య సగటు విస్తీర్ణం కంటే ఈ ఏడాది జూలై మధ్యలో 26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర మంచు తక్కువగా ఉంది. ఇది అర్జెంటీనా దేశ విస్తీర్ణంతో సమానం. అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూమెక్సికో, అరిజోనా, నెవడా, ఉతాహ్, కొలరాడో రాష్ట్రాల ఉమ్మడి విస్తీర్ణంతో సమానం. అంటార్కిటికాలో సముద్రపు మంచు కొన్ని దశాబ్దాలుగా రికార్డు స్థాయి నుంచి కనిష్టానికి పడిపోతోంది. ఇది చాలా అసా«ధారణ పరిణామమని, 10 లక్షల ఏళ్లకోసారి ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం, వాతావరణ మార్పులు అంటార్కిటికాను మరింతగా ప్రభావితం చేస్తాయని అంటున్నారు. -
అమెరికన్లకు చుక్కలు చూపిస్తున్న బాంబ్ సైక్లోన్.. భయానక వీడియోలు ఇవే..
Bomb Cyclone.. అగ్రరాజ్యం అమెరికా.. బాంబ్ సైక్లోన్ ధాటికి వణికిపోతోంది. మంచు తుఫాన్ కారణంగా దాదాపు 13 రాష్ట్రాల్లో అమెరికన్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లలో నుంచి బయట అడ్డుగుపెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. మంచు తుఫాన్ క్రిస్మన్ పండుగపై కూడా ఎఫెక్ట్ చూపించింది. తుఫాను కారణంగా పండుగ వేళ దేశ వ్యాప్తంగా దాదాపు 5,700 విమానాలను అధికారులు రద్దు చేశారు. పలు చోట్ల రోడ్లపై మంచు పేరుకుపోవడంతో రోడ్డు మార్గాలను మూసివేశారు. At least 17 people have died across eight states as a "bomb cyclone" winter storm grips the US, officials say. pic.twitter.com/649fv36k2m — DW News (@dwnews) December 24, 2022 దీంతో, క్రిస్మస్ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని 60 శాతం మందిపై ఈ మంచు తుఫాను ప్రభావం పడింది. అమెరికా లెక్కల ప్రకారం.. మంచు తుఫాన్ కారణంగా ఇప్పటికే 18 మంది మృతిచెందారు. మంచుతుఫాన్ కారణంగా ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరిగే నీటిని సైతం గాల్లోకి విసిరితే సెకన్ల కాలంలో ఆ నీరు మంచులా మారిపోతోంది. కాగా, అమెరికా మంచు తుఫాను ధాటికి వాహనాలు కూడా రోడ్డుపై జారుకుంటూ వెళ్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. And this is WHY I stayed home today. I also live on a hill and no matter how much they sand, it’s too unsafe. Stay safe out there. #icestorm #WinterStorm pic.twitter.com/rzTE3nshwY — Kento Ito (@alchemistmuffin) December 24, 2022 Break the screen guard 🥶 #WinterStorm #Elliott #Hampton #ColdWave #Virginia #BombCyclone #Snow #Storm #Blizzard #Viral #Weather #Climate #Winter #GlobalWarming #ArcticBlast #USA #VAwx Snowy #carcrashes & #bus #crash in #USA from #December 2022 #severeweather pic.twitter.com/je7cIUv7yp — kartik (@manishh_2) December 24, 2022 బాంబ్ సైక్లోన్ అంటే.. బాంబ్ సైక్లోన్ అనేది మధ్య-అక్షాంశ తుపాను. దీనిలో కేంద్ర పీడనం గంటకు ఒక మిల్లీబార్ వద్ద కనీసం 24 గంటల పాటు వేగంగా పడిపోతుంటుంది. అయితే, తుపాను ఎక్కడ ఏర్పడుతుందనే అనే దాని ఆధారంగా మిల్లీబార్ రీడింగులు మారే అవకాశం ఉంటుంది. వాయు పీడనం అనేది వాతావరణం యొక్క బరువు ద్వారా ప్రయోగించే శక్తిని కొలవడం. ఈ పీడనం ఎంత తక్కువగా ఉంటే తుపాను అంత బలంగా ఉంటుందన్న మాట. బాంబు తుపాన్ ఎలా ఏర్పడుతుందంటే.. వివిధరకాల వాయు ద్రవ్యరాశి (చల్లని, పొడి) గాల్లో కలిసినప్పుడు. వెచ్చని గాలి పెరిగేకొద్దీ, అది గాలి ఒత్తిడిని తగ్గించే క్లౌడ్ వ్యవస్థను సృష్టిస్తుంది. అల్పపీడన ప్రాంతం చుట్టూ అపసవ్య దిశలో ప్రసరించే తుఫానుగా ఏర్పడుతుంది. A "bomb cyclone" winter storm is threatening travel plans — and lives — ahead of the holiday weekend. More than 1 million people across the U.S. have lost power as the storm is reaching the East Coast on Friday. https://t.co/3Z8Wk02HLb pic.twitter.com/zUAfipK3lo — The New York Times (@nytimes) December 23, 2022 జనావాసాలపై బాంబ్ సైక్లోన్ ప్రభావం ఊహించని రీతిలో ఉంటుంది. మనుషుల ప్రాణాలు తీయడంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంటుంది. గట్టిగా గాలి పీల్చినా.. మాట్లాడినా సరే ఆ చలికి తెమడ పట్టేసి.. ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. -
28 ట్రిలియన్ టన్నుల మంచు మాయం
లండన్: భూమిపై ఉన్న మంచు కరిగే వేగం నానాటికీ పెరిగిపోతోంది. 1994-2017 మధ్య 28 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయిందని తాజా అధ్యయనం వెల్లడించింది. గత మూడు దశాబ్ఞాలలో పోలిస్తే భూమిపై ఉన్న మంచు కరగే వేగం పెరిగిందని లండన్ కి చెందిన లీడ్స్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో తేలింది.1990లలో సంవత్సరానికి 0.8 ట్రిలియన్ టన్నుల మేర మంచు కరిగేదని, 2017నాటికి ఏటా కరిగే మంచు 1.3 ట్రిలియన్ టన్నులకు చేరిందని ఈ అధ్యయనం తెలిపింది. శాటిలైట్ డేటా ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు.(చదవండి: ఎలోన్ మస్క్ 'స్పేస్ఎక్స్' సరికొత్త రికార్డ్!) గత 23 సంవత్సరాల్లో పరిశీలిస్తే మంచు కరిగే వేగం 65 శాతం పేరిగిందని తేలింది. అంటార్కిటికా, గ్రీన్లాండ్లో ఐస్ షీట్లు కరిగిపోవడంతో మంచు కరిగే వేగం పెరిగినట్లు వివరించింది. ఈ సర్వేలో 2.15 లక్షల గ్లేసియర్లను అధ్యయనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మంచు వేగంగా కరగడం కారణంగా సముద్ర మట్టం పెరిగి తీరప్రాంతలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే వన్యప్రాణులకు నివాసంగా ఉండే సహజ ఆవాసాలను తుడిచిపెట్టే ప్రమాదం ఉంది అని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. పర్యావరణ పతనానికి సంబంధించి శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే వేగంగా దారుణ పరిణామాలన్నీ క్రమంగా ప్రత్యక్షమవుతున్నాయి. అధ్యయనంలో వాతావరణంలో, మహాసముద్రాలలో ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా మంచు వేగంగా కరిగిపోతుందని తెలుస్తుంది. -
నవ్వింత: ఎంతపని చేశావురా... స్పీల్బర్గూ!
‘‘ఒరే స్పీల్బర్గూ!... నీ సినిమా ఐస్బర్గును ఢీకొట్ట. అన్నీ చూపించి ఆ ఒక్కటి చూపించకపోబట్టే కదా నాకీ తిప్పలు’’ అని తిట్టుకున్నాన్నేను. నేను స్పీల్బర్గును తిట్టడానికి కారణం... మా బుడ్డోడు. మా బుడ్డోడు నిద్ర పోబోయే ముందర వాడితో తప్పనిసరిగా ఒకసారీ, మళ్లీ సరిగ్గా గంట తర్వాత లేపి మరోసారీ ‘సూసూ’ పోయించాలి. లేకపోతే పక్క తడిపేస్తాడేమోనని భయం. అందుకే కొద్దిరోజులుగా మేమీ నియమాన్ని తప్పక ఫాలో అవుతూ వస్తున్నాం. ఈ క్రమంలో వాడు నన్ను అడిగిన ప్రశ్న నాకు దిమ్మతిరిగేలా చేసింది. అంతేకాదు... స్పీల్బర్గును విపరీతంగా తిట్టుకునేలా కూడా చేసింది. ఓ రాత్రి మా బుజ్జిగాడితో సూసూ పోయిస్తూ ఉండగా... వాడో విచిత్రమైన ప్రశ్న అడిగాడు నన్ను. అప్పటివరకూ అది కూడా అన్ని రాత్రుల్లాగా మామూలు రాత్రే అనుకున్నా. కానీ అది నా పాలిట కాళరాత్రి కాబోతోందని అప్పటికి నాకు తెలియదు. ‘‘నాన్నా... డైనోసార్ సూసూ చేస్తే అది ఒక లీటరో, ప్ఫది లీటర్లో ఉంటుంది కదా’’ అంటూ అడిగాడు మా బుజ్జిగాడు. అంతే... నాకు కాసేపు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇటీవల వాడు సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూడటం ఎక్కువైంది. పోన్లే అంతా మనమంచికే కదా అనుకున్నా. కానీ అది మన మెడకు ఇలా చుట్టుకుంటుందని అప్పటికి నాకు తెలియదు. ‘‘లెక్కప్రకారమైతే అలాగే ఉండాలి’’ అన్నా అయోమయంగా. ‘‘డైనోసార్ అంటే ఏమిటి? రాక్షసబల్లి. మరి... మామూలు బల్లి కూడా సూసూ పోస్తే మన గోడలన్నీ తడిచిపోవాలి కదా. కానీ అలా జరగడం లేదు కదా. అలాంటప్పుడు మన ఇంటి బల్లే పోయనప్పుడు మరి రాక్షసబల్లి సూసూ పోస్తుందంటావా?’’ అని అడిగాడు. ‘‘పక్షులన్నీ బల్లి జాతి తర్వాత వచ్చినవే. మరి అవి సూసూ పోయడం లేదు కదా. కేవలం టాయ్లెటుకు వెళ్తాయంతే. కాబట్టి దాని కంటే ఎంతో ముందు పుట్టిన డైనోసార్ కూడా సూసూ పోయదనుకుంటా’’ అన్నాను నేను. ‘‘నువ్వు ఇంత పెద్ద వాడివి. పైగా నాకంటే పెద్ద క్లాసులు చదువుకున్నావు. డైనోసార్ సూసూ పోస్తుందో, పోయదో నీకు తెలియదా?’’ అన్నాడు వాడు నన్ను హీనంగా చూస్తూ. బోల్డంత అవమానం అనిపించింది. పోన్లే ఓసారి స్టీవెన్ స్పీల్బర్గ్ను పలకరిద్దాం అనుకున్నా. వెంటనే జురాసిక్ పార్కులోకి ప్రవేశించి, డైనోసార్లను కాస్త పరికిద్దును కదా... అవి మరుగుదొడ్డికి వెళ్లిన అంశాన్ని ఇన్డెరైక్ట్గా చెప్పాడు. అంతే తప్ప అవి సూసూ పోశాయా, లేదా అన్న వివరం మాత్రం వివరంగా లేదు. ‘‘స్పీల్ బర్గ్ కూడా పెద్దగా ఏమీ చెప్పలేదురా. కాకపోతే దోమలూ డైనోసార్లనూ కుడతాయని తేలింది’’ అన్నాను. ‘‘అయ్యోపాపం... దోమల్ని తరిమేద్దామంటే డైనోసార్లకు ముందు చేతులు కూడా వీక్ కదా నాన్నా’’ అని జాలిపడుతూ అంతలోనే కోపం తెచ్చుకుని... ‘‘అయినా ఇంత చిన్న విషయాలు కూడా పెద్దలకు తెలియకపోవడం ఏమిటీ?’’ అంటూ కోప్పడ్డాడు వాడు. ఇక చివరకు చేసేదేం లేక ‘ఒరే... డైనోసార్లతో నాకు పెద్దగా పరిచయం లేదురా. నాకేమీ తెలియదు రా’ అంటూ వాడి దగ్గర సరండరైపోయా. అప్పుడు తీరా వాడో మాట అంటే నేను మళ్లీ అవాక్కైపోయా! ‘‘నానా... డైనోసార్ బిడ్డ కూడా రాత్రిపూట నాలాగే నిద్రలో పక్క గానీ తడిపిందంటే, దాని సూసూలో అదే మునిగిపోతుందేమో కదా నాన్నా’’ అన్నాడు ఆందోళనగా. అది మునగడం ఏమోగానీ... నేను మాత్రం నిండా మునిగిపోయా... ఆశ్చర్యంలో!! చివరకు స్పీల్బర్గుకు మెయిలిద్దాం అని నిర్ణయించుకున్నా. కానీ శతకోటి మెయిళ్లలో నాదీ మరొకటి అవుతుందేమో అనుకుని... పోస్టుమేనే నేరుగా వెళ్లి స్పీల్బర్గుకే అందించేలా... ‘ఒరేయ్ నాయనా ... మా బుజ్జిగాడి కోసమైనా మరో సినిమా తియ్రా’ అంటూ రేపు అతగాడికో ‘ఇంగ్లాండు లెటర్’ రాద్దామనుకుంటున్నా. అన్నట్టు ఇంగ్లాండు లెటర్ స్పీల్బర్గు వాళ్ల ఊరు అమెరికా వెళ్తుందో లేదో? - యాసీన్