Electricity Cuts Could Last Up To Seven Days Worry Amid Winter In UK - Sakshi
Sakshi News home page

UK Power Cuts: విద్యుత్‌ కోతలతో అల్లాడుతున్న బ్రిటన్‌...7 రోజులు కరెంట్‌ లేకుండా....

Published Wed, Nov 2 2022 6:59 PM | Last Updated on Wed, Nov 2 2022 7:33 PM

Electricity Cuts Could Last Up To Seven Days Worry Amid Winter In UK - Sakshi

యూకేలో శీతకాలం వస్తే చాలు  ఏడు రోజుల వరకు విపరీతమైన కరెంట్‌ కోతలు ఉంటాయి. ఈ విషయమే యూకే ప్రభుత్వం, కౌన్సిల్‌లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నడంలో సహాయపడే ప్రత్యామ్నాయాలు గురించి అన్వేషిస్తోంది. వాస్తవానికి బ్రిటన్‌లో చలికాలంలో ఒక్కోసారి దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయి పరిస్థితి మరింత ఘోరంగా ఉంటే మాత్రం ఈ కరెంటు కోతలు తప్పనిసరి. దీన్ని 2021లో జాతీయ గ్రిడ్‌లో పెద్ద సాంకేతిక లోపం ఏర్పడినప్పటి నుంచి ప్రోగ్రామ్‌ 'యారో' పేరుతో ఇలా శీతకాలంలో ఈ విద్యుత్‌ కోతలను విధించడం అమలు చేశారు.

ముందస్తు హెచ్చరికలు లేకుండా అన్ని రంగాల్లో  కరెంట్‌ కోతలు విధిస్తారు. దీని వల్ల 60% విద్యుత్‌ డిమాండ్‌ సుమారు 7 రోజుల వరకు ఉంటుంది. ఇళ్లు, వ్యాపారాలకు అడపదడప కరెంట్‌ యాక్సిస్‌ ఉంటుంది. ఈ సమయంలో అనలాగ్‌ ఎఫ్‌ఎంలు పనిచేస్తాయి. ఈ ప్లాన్‌ అత్యంత దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రంగా ఉన్నప్పుడూ మాత్రమే అమలు చేస్తామని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఐతే వారం రోజుల్లో తిరిగి విద్యుత్‌ను యథావిధిగా పునరుద్ధరిస్తామని తెలిపింది. అందుకే ఆ పరిస్థితికి అనుగుణంగానే పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధమవుతాయని చెబుతోంది బ్రిటన్‌.

(చదవండి: పుతిన్‌ ఆరోగ్యంపై మళ్లీ.. ఇంజెక్షన్లతో నల్లగా మారిన చేతులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement