కోపెన్‌హాగన్: డెన్మార్క్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడి చేసిన నేటికి (అక్టోబర్ 7 తేదీ) ఏడాది. ఈ నేపథ్యంలోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోపెన్‌హాగన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి 500 మీటర్ల దూరంలో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు.
ఇజ్రాయెల్ రాయబార భవనానికి సమీపంలో ఐదు రోజుల క్రితం రెండు పేలుళ్లు సంభవించిన తర్వాత మళ్లీ పేలుడు జరగటం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం జరిగిన పేలుళ్లలో ఇద్దరు స్వీడిష్ జాతీయులను పోలీసులు అరెస్టు చేశారు.
The #blast occurred some 500 metres (yards) from the embassy in Copenhagen and came five days after two explosions near the building for which two Swedish nationals have been remanded in #custody.#IsraelEmbassy #denmark https://t.co/MynYeyyNzZ
— The Daily Star (@dailystarnews) October 7, 2024
క్రెడిట్స్: The Daily Star
‘‘ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధం ఉందా? లేదా? అనే విషయం పరిశీలిస్తున్నాం’’ అని కోపెన్‌హాగన్ పోలీసు ఇన్‌స్పెక్టర్ ట్రిన్ మొల్లెర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయితే.. ఈ పేలుడు ఘటన తుపాకీ కాల్పుల వల్ల సంభవించి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను స్థానిక మీడియా ప్రసారం చేసింది.
మరోవైపు.. డెన్మార్క్‌లో ఇటీవల అక్టోబర్ 2న జరిగిన పేలుళ్లలో ఇరాన్ ప్రమేయం ఉండవచ్చని, స్టాక్‌హోమ్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన కాల్పుల్లో సైతం ఆ దేశ ప్రమేయం ఉందని స్వీడన్ గూఢచార సంస్థ సపో అనుమానం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment