తీవ్ర అభ్యంతరం తెలిపిన భారత్
న్యూఢిల్లీ: కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. వాంకోవర్‌లో ఉన్న భారత కాన్సులేట్ ఎదురుగా రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ దిష్టి»ొమ్మను దహనం చేయడంతోపాటు ‘సిటిజన్స్ కోర్ట్’ను నిర్వహించారు. ఈ వ్యవహారంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
భారత్‌లోని కెనడా హై కమిషన్‌కు డిప్లొమాటిక్ నోట్ ద్వారా అభ్యంతరం తెలిపింది. ఖలిస్తానీ శక్తుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రూడో ప్రభుత్వం వేర్పాటువాదులకు దన్నుగా నిలుస్తోందని ఆరోపించింది. గతేడాది జరిగిన నిజ్జర్ హత్యకు భారత్ ఏజెంట్లే కారణమన్న కెనడా ప్రధాని ట్రూడో తీవ్ర ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment