టోక్యో: జపాన్ ప్రధానికి ఫుమియో కిషిడాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన తన అధికారిక నివాసంలో చికిత్స తీసుకుంటున్నారని ఆయన కార్యాలయం పేర్కొంది. ప్రధాని ఫుమియో గత వారం రోజులుగా సెలవుల్లోనే ఉన్నారు. తదనంతరం సోమవారం నుంచి ఆయన తిరిగి విధులకు హాజరు కావాల్సి ఉంది.
ఐతే ప్రధాని ఫుమియోకి శనివారం నుంచి కాస్త దగ్గు, జ్వరంతో భాదపడుతుండటంతో పీసీఆర్ పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు జపాన్ క్యాబినేట్ ప్రతినిధి తెలిపారు. అదీగాక జపాన్‌లో గత కొన్ని రోజులుగా కరోనాకి సంబంధించిన కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయినప్పటికీ మరణాలు సంఖ్య మాత్రం తక్కువగానే ఉండటం జపాన్‌కి కాస్త ఊరటనిచ్చే అంశం.
(చదవండి: ఇంటర్వ్యూలో ఆమె వయసు అడిగినందుకు... పరిహారంగా రూ. 3 లక్షలు..)
Comments
Please login to add a commentAdd a comment