నీ ఒంట్లో ఏమైనా స్ప్రింగ్‌ ఉందా ఏంటి! | Little Girl Backflips Like Wheel Very Fast At Same Place Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

నీ ఒంట్లో ఏమైనా స్ప్రింగ్‌ ఉందా ఏంటి!

Published Wed, Apr 21 2021 5:00 PM | Last Updated on Wed, Apr 21 2021 7:46 PM

Little Girl Backflips Like Wheel Very Fast At Same Place Video Viral On Social Media - Sakshi

మనలోని ప్రతిభను ప్రదర్శించడానికి సోషల్‌ మీడియా మంచి వేదికగా మారింది. టాలెంట్‌ ఉంటే చాలు.. రాత్రికి రాత్రి మనల్ని స్టార్స్‌ని చేస్తుంది సోషల్‌ మీడియా. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తుంది. దీన్ని చూసిన వారంతా ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. సదరు చిన్నారి మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ వీడియో ఎంత వైరల్‌ అయ్యిందంటే ఇప్పటికే దీన్ని 66 లక్షల మందికి పైగా చూశారు. ఈ కౌంట్‌ ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంత మంది దృష్టిని ఆకర్షించిన ఈ వీడియోలో ఏం ఉంది అంటే ఓ చిన్నారి ఆగకుండా దాదాపు 90 సార్లు పల్టీలు కొడుతుంది. ఈ పాప ప్రదర్శించే ఫీట్‌ చూస్తే మనకు తల తిరుగుతుంది. 

ఈ చిచ్చర పిడుగు ఆపకుండ.. ఏకధాటిగా దాదాపు 85-90 పల్టీలు కొడుతుంది. సాధారణంగా పది సార్లు ఇలా పల్టీలు కొడితేనే కడుపులో తిప్పినట్లు అవుతుంది. అలాంటిది ఈ చిన్నారి ఇలా ఆపకుండా బ్యాక్‌ఫ్లిప్స్‌  చేస్తూనే ఉంది. అది కూడా ఒకే ప్రదేశంలో. ఏమాత్రం తడబాటు లేకుండా ఈ ఫీట్‌ ప్రదర్శించింది. రెక్స్‌ చాంప్‌మాన్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ తన అకౌంట్‌లో ‘‘నా కళ్లని నేనే నమ్మలేకపోతున్నాను’’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో తెగ వైరలవుతోంది. చిన్నారి విన్యాసం చూసిన వారంతా ‘‘నీ శరీరంలో వెన్నెముకకు బదులు స్ప్రింగ్‌ ఉందా ఏంటి తల్లి’’.. ‘‘నీ టాలెంట్‌ను మెచ్చుకోవడానికి మాటలు రావడం లేదు’’ అంటూ ప్రశంసిస్తున్నారు. 

చదవండి: ఫోన్‌ దొంగిలించిన పక్షి.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement