పెంపుడు పంది కోసం న్యాయపోరాటం  | Man Fights To Keep His Pet Pig Emotional Support USA | Sakshi
Sakshi News home page

పెంపుడు పంది కోసం న్యాయపోరాటం 

Published Sat, Feb 12 2022 1:17 PM | Last Updated on Sat, Feb 12 2022 1:17 PM

Man Fights To Keep His Pet Pig Emotional Support USA - Sakshi

కనజోహరే: అమెరికాకు చెందిన ఫ్లాట్‌ అనే వ్యక్తి ఎల్లి అనే తన పెంపుడు పంది కోసం న్యాయస్థానం మెట్లెక్కాడు. స్థానిక అధికారులు పందిని ఇంట్లో పెంచుకోవడం కుదరదని, అది ఫామ్‌ జంతువని, అందువల్ల దాన్ని ఫామ్‌హౌస్‌లో లేదా అడవిలో వదిలేయాలని ఫ్లాట్‌కు సూచించారు.

పందిని ఇంట్లో పెంచుకోవడం కుదరదని తెగేసి చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఫ్లాట్‌ అధికారులపై క్రిమినల్‌ కేసు వేశాడు. ఎల్లి తనను కష్ట సమయాల్లో ఓదార్చిందని, కుక్కల కన్నా ఎంతో తెలివైందని, దాన్ని వదులుకోనని వాదిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement