వీడియో దృశ్యాలు
న్యూయార్క్ : తన సోషల్ మీడియా అకౌంట్‌ను ప్రమోట్ చేసుకోవటానికి ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడిందో అమెరికన్ నటి. తనను కొందరు కిడ్నాప్ చేశారంటూ, తన అకౌంట్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంటేనే దుండగులు వదలిపెడతారంటూ తెగ బాధపడింది. అది ఫేక్ అని కనుగొన్న అభిమానులు, తోటి నటీ,నటులు విమర్శలు చేయటంతో వీడియో డిలీట్ చేసి మరో కొత్త నాటకానికి తెరతీసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికన్ నటి, రియాలిటీ స్టార్ మసిక కలైశాకు ‘ఓన్లీఫ్యాన్స్’ అనే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో అకౌంట్ ఉంది. తన అకౌంట్‌ను ప్రమోట్ చేసుకోవటానికి ఓ వినూత్న పద్ధతిని వెతుక్కుంది మసిక. తనను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఓ వీడియోను తన ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. ( జీవితంలో అది తల్చుకోకుండా వంట చేయను)
ఒంటిపై పలు చోట్ల గాయాలైనట్లు ఉన్న ఆ వీడియోలో ‘‘నాకెంత సమయం ఉందో నాకు తెలియదు. నేను బాగా దెబ్బలు తిన్నా.. వాళ్లు నన్ను వెంబడిస్తున్నారు. నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం లాక్కున్నారు. నాకు సహాయం చేయండి. నా ఓన్లీఫ్యాన్స్ అకౌంట్‌ను వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే వాళ్లు నన్ను వదిలేస్తారు’’ అని కన్నీరు పెట్టుకుని ప్రార్థించింది. ఈ వీడియోను చూసిన అభిమానులు, తోటి నటీ,నటులు ఆమెపై ఫైర్ అయ్యారు. ‘డబ్బుల కోసం ఇంత దిగజారాలా?’ అంటూ మండిపడ్డారు. దీంతో వెనక్కు తగ్గిన మసిక, వీడియోను డిలీట్ చేసింది. తాను మహిళల అక్రమ రవాణాపై అవగాహన కల్పించటానికే ఆ వీడియో చేశానని చెప్పుకొచ్చింది. రోస్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ తరపున పనిచేస్తున్నానని, అందుకే అలా వీడియో చేయవల్సి వచ్చిందని చెప్పింది. తన వీడియో ఎవరినైనా భయపెట్టి ఉంటే క్షమించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment