కౌలలాంపూర్: మలేషియాకు చెందిన జాక్రిడ్జ్ రోడ్జి అనే 20 ఏళ్ల యువకుడు శనివారం ఉదయం లేచే సరికి పక్కన ఫోన్ కనిపించలేదు. ఎక్కడ పెట్టానా? అని ఇల్లంతా వెతికాడు. కానీ దొరకలేదు. పోనీ ఎవరైనా ఎత్తుకెళ్లారా? అంటే ఆ ఆనవాళ్లు కూడా కన్పించలేదు. ఏదో మంత్రమేసినట్టుగా ఇలా మాయమైంటేందబ్బా అని తల గోక్కున్నాడు. ఎలాగైనా ఫోన్‌ను కనిపెట్టాల్సిందేనని అనుకున్నాడు. ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేస్తూ ఇంటికి దగ్గర్లోని చిట్టడవికి దారి తీశాడు. అతని తండ్రి అదే పనిగా కాల్ చేస్తుండగా, దాని ద్వారా వచ్చే రింగ్ ఆధారంగా అతను చెవులు రిక్కిరించి మరీ ముందుకెళ్లాడు. అలా ఓ తాటి చెట్టు కింద ఫోన్‌ను గుర్తించాడు. (పెళ్లికి అనుకోని అతిథి, అంతా షాక్!)
మొబైల్‌లో దొంగల ఫొటోలు ఉండొచ్చేమో చెక్ చేయమని అతడి అంకుల్ సలహా ఇచ్చాడు. దీంతో జాక్రిడ్జ్ ఫోన్ ఆన్ చేసి ఫొటోలు చూడగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఎందుకంటే అందులో ఉన్న దొంగ.. మనిషి కాదు, కోతి. అవును, ఆ దొంగ కోతి ఎన్నో సెల్ఫీలు తీసుకుంది. కొన్నిసార్లు ఫోన్‌ను తినేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కొన్ని ఫొటోలు క్యాప్చర్ అవగా, మరికొన్ని వీడియోలుగా రికార్డయ్యాయి. వీటన్నంటికి అతడు సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా తెరిచిన కిటికీ ద్వారా ఆ కోతి ఇంట్లోకి వచ్చి, తన ఫోన్ ఎత్తికెళ్లి ఉంటుందని జాక్రిడ్జ్ చెప్పుకొస్తున్నాడు. (కునుకు తీసిన కోతి.. నవ్వులు పూయిస్తున్న వీడియో)
Something yang korang takkan jumpa setiap abad. Semalam pagi tido bangun bangun tengahari phone hilang. Cari cari satu rumah geledah sana sini semua takde then last last jumpa casing phone je tinggal bawah katil tapi phonenya takde. Sambung bawah. pic.twitter.com/0x54giujnY
— z (@Zackrydz) September 13, 2020
Comments
Please login to add a commentAdd a comment