దక్షిణాఫ్రికాలో మరింత ప్రమాదకరమైన కరోనాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ బ్రిటన్ స్ట్రెయిన్ కంటే డేంజర్ అని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, ఈ కొత్త కరోనాకు 501 డాట్‌వీ2గా నామకరణం చేశారు. జీనోమ్ శాస్తవేత్తల బృందం ఈ వైరస్‌ను కనుగొంది. ఇది వేగంగా విస్తరిస్తూ మరింత హానికరంగా మారినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ వైరస్ యువతలోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణుల బృందం పేర్కొంది. దీంతో దక్షిణాఫ్రికా నుంచి యూకేకు అన్ని విమాన రాకపోకలను రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment