ఇస్లామాబాద్: పాకిస్తాన్ జైలులో మగ్గుతన్న భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు కాస్త ఊరట లభించింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు మేరకు అతనికి అప్పీలు చేసుకునేందుకు హక్కు కల్పించే బిల్లును పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదించింది. 2017లో.. భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్‌పై పాక్ ఉగ్రవాదం, గూఢచర్యం లాంటి ఆరోపణలు మోపిన పాక్ ఆర్మీ కోర్టు జాదవ్‌కు మరణ శిక్ష విధించింది.
ఈ తీర్పుని భారత్ అంతర్జాతీయ కోర్టు (ఐసీజే)లో సవాల్ చేసింది. దీంతో ఇరు దేశాల వాదనలు విన్న ఐసీజే 2019లో భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జాదవ్‌కు విధించిన మరణ శిక్షపై పునరాలోచించడంతోపాటు సమీక్షించాలని తెలిపింది. అంతర్జాతీయ న్యాయస్థానం ( ఐసీజే) తీర్పుకు సంబంధించి భారత ఖైదీ కులభూషణ్ జాదవ్‌కు అప్పీలు చేసుకునే హక్కును కల్పించే బిల్లును పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఆమోదించింది.
2020లో, ప్రతిపక్ష పార్టీల నిరసనలు ఉన్నప్పటికీ, కులభూషణ్ జాదవ్ విషయంలో ఐసీజే తీర్పును దృష్టిలో ఉంచుకుని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం నేషనల్ అసెంబ్లీలో ఒక ఆర్డినెన్స్‌ను సమర్పించింది. దీని ప్రకారం.. 'ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రివ్యూ అండ్ రీకన్సిడరేషన్ ఆర్డినెన్స్ 2020' గతేడాది మే 20న అమల్లోకి వచ్చింది.
చదవండి: చదువుకి మధ్యలో ఫుల్ స్టాప్.. అప్పుడు తీసుకున్న రిస్క్ మిలియనీర్‌గా మార్చింది!
Comments
Please login to add a commentAdd a comment