సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యూరప్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. బుధవారం డెన్మార్క్‌లో జరిగిన రెండవ భారత్-నార్డిక్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని హాజరయ్యారు. ఈ సమావేశం ప్రధానంగా కరోనా మహమ్మారి అనంతర ఆర్థిక పునరుద్ధరణ, వాతావరణ మార్పు, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్య, ఇంధన, మౌలిక రంగాల్లో పరస్పర సహకారం సహా ద్వైపాక్షిక బలోపేతంపై చర్చలు జరిపారు. ఈ సదస్సులో డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్ ప్రధాన మంత్రులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యుయెల్ మక్రాన్‌తో ప్రధాని మోదీ భేటికానున్నారు. బుధవారంతో ప్రధాని మూడు రోజుల యూరప్ పర్యటన ముగియనుంది. కాగా మొదటి ఇండియా-నార్డిక్ శిఖరాగ్ర సమావేశం 2018లో స్టాక్‌హోమ్‌లో జరిగింది.
Prime Minister Narendra Modi and other Heads of Government participate in India-Nordic Summit at Christiansborg Palace in Copenhagen, Denmark. pic.twitter.com/v9aizZ8ezP
— ANI (@ANI) May 4, 2022
Comments
Please login to add a commentAdd a comment