
మాస్కో: స్థానిక చట్టాల ప్రకారం నిషేధిత అంశాలను తొలగించడంలో విఫలమైనందుకు గూగుల్‌కు రూ.750 కోట్లు, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాకు రూ.175 కోట్ల జరిమానాను మాస్కో కోర్టు విధించింది. పదేపదే ఆదేశించినా నిర్లక్ష్యం చేసినందుకు పరిపాలనా జరిమానా కింద రూ.750 కోట్లు చెల్లించాలని తగన్‌స్కీ కోర్టు ఆదేశించింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, ఆయుధా లు, పేలుడు పదార్థాలకు సంబంధించిన అంశాలను తొలగించడంలో విఫలమ య్యారని ఆరోపిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై రష్యా అధికారులు ఒత్తిడిని క్రమంగా పెంచారు.
జైల్లో ఉన్న ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీకి మద్దతుగా అనుమతులు లేని నిరసనలను ప్రకటించడానికి అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. రష్యాలో గూగుల్ కార్యకలాపాలను ఈ జరిమానా ప్రభావితం చేయబోదని, ఇతర సాంకేతిక దిగ్గజాలకు ఓ సందేశమిచ్చినట్లు ఉంటుందని రష్యా అధికారి అలెగ్జాండర్ ఖిన్‌స్టీన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment