
Child explains Newton's fourth law in hilarious way: గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలన్ని కోవిడ్‌తో అల్లాడిపోతున్నాయి. ఒకనొక దశలో వ్యాక్సిన్లు లేక వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడేమో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ఆ వైరస్ తన తీరుని మార్చకుంటోంది. పైగా ఒక్కొక్కరిలో ఒక్కోలా మారి వేగంగా వ్యాపిస్తోంది. అయితే దీని విజృంభణ గురించి ఒక విద్యార్థి న్యూటన్ నాల్గవ నియమాన్ని అనుసరిస్తూ వేగంగా వ్యాపిస్తోందని హాస్యాస్పదంగా చెబుతున్నాడు.
(చదవండి: అమానుష చర్య: ఆ హత్య కేసులో తండ్రి కొడుకులిద్దరికి జీవిత ఖైదు!!)
అసలు విషయంలోకెళ్లితే...ఒక విద్యార్థి సర్ ఐజాక్ న్యూటన్‌కి సంబంధించిన నాల్గవ నియమం ప్రకారం కరోనా, పరిశోధనలు ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. అంటే కరోనా పెరుగుతుంటే, పరిశోధనల క్రమం నెమ్మదిస్తోంది. అదే పరిశోధనలు వేగవంతం అవుతుంటే కరోనో తగ్గుముఖం పడుతోంది. అంతేకాదు దీన్ని ఒక సమీకరణాన్ని రూపంలో చూపించి మరీ వివరించి చెప్పాడు. పైగా 'కే' అనే ఒక స్టిరమైన వేరియబుల్ "వినాశనం"ను సూచిస్తుందని అన్నాడు.
కరోనా తగ్గుముఖం పట్టడంతో గతేడాది సెప్టెంబర్ సమయాల్లో స్కూళ్లు ఆఫీసులు తెరుచుకుని మళ్లీ పరిస్థితి పూర్వవైభవం సంతరించుకుంటుంది అనే క్రమంలో మళ్లీ కరోనా కొత్త వేరియంట్‌తో విరుచకుపడటం మొదలు పెట్టింది. దీంతో ప్రజలకు మళ్లీ ఇళ్లకే పరిమితమవ్వల్సి రావడంతో ఒకింత నిరాశ నిస్ప్రహలకు గురయ్యారనే చెప్పాలి. ఈ క్రమంలోనే విసుగు పుట్టి ఒక విద్యార్థి ఇలా కరోనా విజృంభణను సమీకరణ రూపంలో వివరించాడు. అంతేకాదు ఈ విషయానికి "కోవిడ్ కాల్ కా న్యూటన్ (న్యూటన్ ఆఫ్ కోవిడ్ టైమ్స్)” అనే క్యాప్షన్ జోడించి మరీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సందేశం నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
(చదవండి: డేటింగ్ యాప్‌లో పరిచయం..మత్తిచ్చి..చంపి ఆ భాగాలను తినేశాడు!)
‘कोविड काल’ का न्यूटन. pic.twitter.com/5kZRckVBhP
— Awanish Sharan (@AwanishSharan) January 4, 2022