1. మచిలీపట్నంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు
మచిలీపట్నం మండలం గరాల దిబ్బలో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ వర్గీయులపై కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. AP SSC Results 2022: నేడే టెన్త్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను జూన్ 6వ తేదీన(సోమవారం) విడుదల చేయనున్నారు.ఈ ఫలితాలను మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ పలితాలను విడుదల చేయనున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. 20లోగా ఇంటర్ ఫలితాలు.. నెలాఖరుకు టెన్త్ ఫలితాలు కూడా..!
రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా సాగుతోంది. ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ దాదాపు పూర్తయినట్టేనని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ నెల 20లోగా ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డ్ కృత నిశ్చయంతో ఉంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4.TS Group 1 Prelims: గ్రూప్–1 ప్రిలిమ్స్ కటాఫ్ తీరే వేరు!
గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. జూలై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఇప్పటికే నోటిఫికేషన్‌లో వెల్లడించింది. పరీక్షల గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు కూడా మరింత సన్నద్ధతతో దీక్ష చేస్తున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికే మెయిన్ పరీక్షలకు అవకాశం ఉంటుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. ఉక్రెయిన్‌కు ఆయుధాలిస్తే ఖబడ్దార్
ఉక్రెయిన్‌కు లాంగ్–రేంజ్ రాకెట్ సిస్టమ్స్, ఇతర ఆయుధాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. తీరు మార్చుకోవాలని, తమ మాట వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇప్పటిదాకా ఎన్నడూ దాడి చేయని లక్ష్యాలపై దాడులకు దిగుతామని తేల్చిచెప్పారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. కుక్క కరిచిందా.. అయితే రూ.10వేలు తీసుకోవడం మరచిపోకండి!
కుక్క కాటుకు అదేదో దెబ్బ అని ఒక నానుడి ఉంది. కుక్క కరిస్తే యాంటి రేబీస్ టీకాలు వేసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. ఆపై బెంగళూరు పాలికెలో దరఖాస్తు చేసుకుంటే పరిహారం కూడా లభిస్తుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7.‘ఇష్టపడి పెళ్లి, ఇష్టపడే ఆత్మహత్య చేసుకుంటున్నా.. క్షమించు అమ్మా’
నవ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. చిక్కమగళూరు జిల్లా చోళనహళ్లికి చెందిన అంజు (26) ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. నాలుగు నెలల క్రితం అంజన్ కణియార్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకొంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. సాటిరారు నీకెవ్వరు.. మట్టికోర్టుకు రారాజు నాదల్.. పలు అరుదైన రికార్డులు!
మట్టికోర్టులో తనకు తిరుగులేదని స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించుకున్నాడు. ఏకంగా 14వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచి సత్తా చాటాడు. తద్వారా కెరీర్‌లో 22వ ‘గ్రాండ్’ టైటిల్ కైవసం చేసుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. కోలీవుడ్‌కి కియారా.. ఆ హీరోతో ఫస్ట్ మూవీ!
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తమిళంలో ఓ సినిమా చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. శివ కార్తికేయన్ హీరోగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో హీరోయిన్ పాత్రకు కియారా అద్వానీని సంప్రదించి, కథ కూడా వినిపించారట దర్శకుడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. అదిరింది.. అంబానీ కాబోయే కోడలి అరంగేట్రం
నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలతో మారుమోగే నగరం ముంబై. కొద్దినెలలుగా చడీచప్పుడూ లేకుండా మూగబోయింది. కానీ ఆదివారం జరిగిన ఓ భరత నాట్య ప్రదర్శన మాత్రం అంతటా చర్చనీయాంశంగా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ–నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్ భరతనాట్యం అరంగేట్ర కార్యక్రమం అది.
Comments
Please login to add a commentAdd a comment