ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌కు యూనైటేడ్ అరబ్ ఎమిరేట్స్ ఊహించని షాక్ ఇచ్చింది. పాక్ నుంచి వస్తున్న సందర్శకులకు వీసాలను రద్దు చేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. పాక్‌తో పాటు మరో 11 దేశాల వీసాలను సైతం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్థానిక ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తీసుకున్నట్లు తెలిపింది. ఇతర దేశాల నుంచి ప్రతి ఏటా విదేశీయులు యూఏఈకి ప్రయాణాలు కొనసాగిస్తారు. (కరోనాపై కథనాలు.. ఐదేళ్ల జైలు)
ఈ క్రమంలోనే వారి వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది ఆ దేశ వైద్య అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. వైద్యులు వినతిని పరిశీలించిన ప్రభుత్వం.. పాకిస్తాన్‌తో పాటు 11 దేశాల వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని పలు దేశాల ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రాన్స్‌తో పాటు, లండన్ ఇప్పటికే రెండో విడత లాక్‌డౌన్ విధించాయి. మరొకొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment