రష్యా- ఉక్రెయిన్ యుద్ధం: రష్యా ఆక్రమిత ప్రాంతమైన జపోరిజ్జియాలోని ఒక గ్రామాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రతినిధి వ్లాదిమిర్ రోగోవ్ అధికారికంగా ప్రకటించారు.
16 నెలలుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటివరకు ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మరెందరో నిరాశ్రయులయ్యారు. జనజీవనం అస్తవ్యస్తమైంది. అయినప్పటికీ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉండగా తాజాగా ఉక్రెయిన్ బలగాలు దక్షిణ జపోరిజ్జియా ప్రాంతంలోని ఒక గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ రష్యా ప్రతినిధి వ్లాదిమిర్ రోగోవ్ అధికారిక ప్రకటన చేశారు. రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నింటినీ తిరిగి సాధించుకోవడమే తమ లక్ష్యమని ఉక్రెయిన్ ఇదివరకే ప్రకటించిన విషయం విదితమే. ఇదే క్రమంలో ఉక్రెయిన్ గత వారం రోజుల్లోనే సుమారు 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకుంది.
మరోపక్క రెండు దేశాల మధ్య సంధి కుదిర్చి శాంతి నెలకొల్పే ప్రయత్నంలో ఆఫికా నాయకులు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ లతో విడివిడిగా చర్చించారు. కానీ ఈ చర్చల వలన ప్రయోజనమేమీ లేనట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: పాఠశాలపై దాడి చేసిన ఉగ్రవాదులు.. 25 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment