![Ukraine Russia Crisis: Netflix Says Wont Air State TV channels In Russia - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/2/netflix.jpg.webp?itok=mGCAOsrw)
మాస్కో: రష్యన్ చానల్స్‌ను ఏవీ తాము ప్రసారం చేయడం లేదని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన వారం తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించింది. రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చానల్స్ అన్నీ ప్రచార ఆర్భాటానికే పరిమితమవుతాయని అందుకే వాటిని ప్రసారం చేయడం లేదని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి చెప్పారు. రష్యాలో ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ అడుగుపెట్టింది.
చట్టాల ప్రకారం ఆ దేశంలో ప్రసారాలు ఉంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చానల్స్‌ని తప్పనిసరిగా ప్రసారం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే యూ ట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ రష్యా ప్రభుత్వ చానల్స్‌పై నిషేధం విధించాయి.
Comments
Please login to add a commentAdd a comment