వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపాలంటూ పదేపదే కోరుతున్నా లెక్కచేయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ ముమ్మాటికీ యుద్ధనేరస్తుడేనని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌లో రష్యా దుశ్చర్యలను యుద్ధ నేరాలుగా బైడెన్ ఇంతకుముందే అభివర్ణించిన సంగతి తెలిసిందే. బైడెన్ తాజా వ్యాఖ్యలపై రష్యా అభ్యంతరం తెలిపింది. ఆయన క్షమించరాని వాక్చాతుర్యం ప్రదర్శించారని విమర్శించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో బాంబుల వర్షం కురిపించి, వేలాది మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న ఒక దేశాధినేత అలా అనుచితంగా మాట్లాడడాన్ని అంగీకరించబోమని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపాలంటూ ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్ జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోబోమన్నారు. తమ అధ్యక్షుడి వ్యాఖ్యలపై అమెరికా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ వివరణ ఇచ్చారు. ఉక్రెయిన్‌లో రష్యా దాడుల దృశ్యాలను, దయనీయ పరిస్థితులను చూసి బైడెన్ చలించిపోయారని, అందుకే పుతిన్‌ను యుద్ధనేరగాడిగా సంబోధించారని చెప్పారు.
(చదవండి: రష్యా రాకెట్ దాడిలో ఉక్రెయిన్ నటి మృతి)
Comments
Please login to add a commentAdd a comment