War would reach a turning point: ఉక్రెయిన్ పై రష్యా పై గత రెండు నెలలకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ మేజర్ జనరల్ బుడనోవ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం రాజధాని కీవ్‌లో ఆగస్టు మధ్య నాటికి ఒక కీలకమైన మలుపు తీసుకుని ఈ ఏడాది చివరికల్లా ముగుస్తుందని అంచనా వేశారు. ఒక వేళ ఉక్రెయిన్‌లో గనుక రష్యా ఓడిపోతే పుతిన్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పుకోక తప్పదని, అతని దేశం కుప్పకూలుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు ఇది చివరికి రష్యాన్ ఫెడరేషన్ నాయకత్వ మార్పుకు దారి తీస్తుందని అన్నారు. ఇప్పటికే పుతిన్ పై తిరుగుబాటు జరుగుతోందని, దాన్ని ఆపడం అసాధ్యం అని చెప్పారు. పుతిన్ అనారోగ్య గురించి కూడా ప్రస్తావించారు. పుతిన్ మానసిక స్థితి కూడా బాగొలేదని అన్నారు. అదీగాక పుతిన్ ఆరోగ్యం పై పలు నివేదికలు ఇప్పటికే రకరకాల ఊహాగానాలకు తెరలేపుతున్న సంగతి తెలిసిందే.
మరోవైపు యూరప్ రష్యాను అతిపెద్ద ముప్పుగా చూస్తున్నప్పటికీ ఉక్రెయిన్ మాత్రం అది అంత శక్తిమంతమైనది కాదంటూ కొట్టిపారేస్తోంది. ఐతే సైనిక అధికారి బుడనోవా రష్యా బలగాలు దాదాపు ఖార్కివ్ చుట్టూ ఉన్న సరిహద్దు వరకు వెనక్కి నెట్టబడ్డాయని, మానవశక్తి పరంగా, ఆయుధాల పరంగానూ రష్యా భారీ నష్టాలను చవిచూసిందన్నారు.
(చదవండి: ఖర్కీవ్ నుంచి రష్యా సేనలు ఔట్!)
Comments
Please login to add a commentAdd a comment