Corona Vaccine: యూఎస్‌ కంపెనీల కీలక ప్రకటన | US Pharma Companies are Hoping to Release Vaccine by the End of November - Sakshi
Sakshi News home page

కరోనా వ్యాక్సిన్‌: ఫైజర్, మోడెర్నా‌ కంపెనీల కీలక ప్రకటన

Published Sat, Oct 17 2020 10:38 AM | Last Updated on Sat, Oct 17 2020 1:07 PM

US Hoping For Two COVID-19 Vaccines By End Of November - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో ఇప్పటికే కరోనా కేసులు 8 మిలియన్లు దాటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల నాటికి కరోనా వ్యాక్సిన్‌లు సిద్ధమవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే వ్యాక్సిన్ విషయంలో తాము సిద్ధంగా ఉన్నట్లు ఫైజర్, మోడెర్నా ప్రకటించాయి. అమెరికన్‌ వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ల అత్యవసర ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నాయి. అయితే అత్యవసర అనుమతి వచ్చిన తర్వాత ఏవిధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.   (నిర్లక్ష్యానికి ఫలితం.. కోటి టెస్ట్‌లు)

ఇక మరో కంపెనీ మసాచుసెట్స్‌ బయోటెక్‌ సంస్థ మోడెర్నా నవంబర్‌ 25 నాటికి టీకా ఆమోదం పొందాలని లక్ష్యంగా పెట్టుకుందని కంపెనీ చైర్మన్‌, సీఈఓ అల్బర్ట్‌ బౌర్లా ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తంగా ఏడాది చివరికల్లా రెండు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రానున్నాయి. నవంబర్‌ మూడో వారంలో టీకాలు ఆమోదం పొందినప్పటికీ.. అవి విస్తృతంగా లభించడానికి కొన్ని నెలల సమయం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే అత్యవసర ఆమోదం పొందినా అవి ఎంతమాత్రం పనిచేస్తాయోనని మరికొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  (ప్రధానమంత్రివా.. మోడల్‌వా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement