వీడియో దృశ్యాలు
వాషింగ్టన్ : మనం తినడానికి ఏదైనా కొంటే ఏం చేస్తాం?.. వాటిని మర్చిపోకుండా.. వీలైనంత తొందరగా తినేస్తాం. కానీ, వాటిని అల్మారాలో దాచిపెట్టి ప్రతిరోజూ వాటివంక చూస్తూ కూర్చోం. అయితే, ఓ మహిళ మాత్రం తినడానికి తెచ్చుకున్న బర్గర్, ఫ్రైస్‌లను తినకుండా కొన్నేళ్ల పాటు దాచిపెట్టింది. తాజాగా వాటిని బయటకు తీసి టిక్‌టాక్ సెలెబ్రిటీ అయిపోయింది. వివరాలు.. అమెరికాకు చెందిన ఓ మహిళ 2004లో మెక్‌డొనాల్డ్ చీజ్ బర్గర్, ఫ్రైస్ కొని ఇంటికి తెచ్చుకుంది. అయితే వాటిని తినకుండా.. పైన కవరు కూడా తీయకుండా అట్టే దాచిపెట్టింది. అలా ఒకటి కాదు రెండు కాదు! ఏకంగా 17 ఏళ్లు దాచింది. ఆమెతో పాటు ఇతరులు కూడా వాటి పరిస్థితి ఎలా ఉందో చూడడానికి తెగ ఆసక్తి చూపేవారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆమె వాటిని తెరిచి చూడటానికి నిశ్చయించుకుంది.
వాటిని కవరులోంచి బయటకు తీసింది. బర్గర్ బాగా ముడుచుకుపోయి గట్టిగా తయారయింది. లోపలి పదార్ధం పీనట్ బటర్‌ను తలపిస్తోంది. ఇక, ఫ్రైస్ తాజాగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఆమె కూతురు సవానా వైట్‌హెడ్ ఈ దృశ్యాలను వీడియో తీసి తన టిక్‌టాక్ ఖాతాలో షేర్ చేయగా వైరల్ అయింది. ఇప్పటివరకు 7 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ‘‘ ఆ ఆహారానికి నా అంత వయసుంది’’.. ‘‘ ఇంకా నయం వాటిని తింటాననలేదు’’.. ‘‘ ఓల్డ్‌ను గోల్డ్ చేశారు కదు తల్లీ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment