
వీడియో దృశ్యం
వాషింగ్టన్ : ఆమె తన కారును అడ్డంగా పెట్రోల్ బంకు క్యూలైన్ మధ్యలోకి తీసుకురావటానికి చూడటంతో గొడవ మొదలైంది. కారును మధ్యలోకి ఎలా తీసుకొస్తావంటూ అతడు తిట్టాడు. ఆమెకు కోపం వచ్చి అతడిపై ‘థూ’ అని ఊసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే త్వరగా ఈ వార్త చదివేయాల్సిందే.. వివరాలు.. గత మంగళవారం సాయంత్రం అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ కారుకు పెట్రోల్ కొట్టించుకుందామని అక్కడి ఓ బంక్ వద్దకు వెళ్లింది. అక్కడ వాహనాలు వరుసగా క్యూలో నిలపబడి ఉన్నాయి. క్యూలైన్ పెద్దగా ఉండటంతో ఆమె వరుస ప్రకారం కాకుండా పక్కనుంచి క్యూలోకి దూరి తన వాహనాన్ని నిలపాలని చూసింది. దీంతో ఆమె కారు క్యూలైన్‌లో ఉన్న వేరే కారును ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఆ కారు ఓనర్‌కు ఆమెకు వాగ్వివివాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. అతడి కారును సమీపించి కారులో కూర్చున్న అతడి ముఖంపై ఉమ్మింది.
ఆ వెంటనే అతడు కారు దిగి ఆమె ముఖంపై ఉమ్మాడు. మరింత కోపం తెచ్చుకున్న ఆమె, అతడిపై దాడికి దిగింది. కొన్ని క్షణాలు గొడవ జరిగింది. గొడవ సమయంలో ఆమె ఫోన్ కిందపడటం, దాన్ని అతడు కాలుతో తన్నటం టకటకా జరిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. మహిళపై దాడి చేసినందుకు, ఆమె ఫోన్‌ను పగులగొట్టినందుకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అతడిపై దాడి చేసినందుకు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు. చెప్పిన రోజున కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ ఇద్దర్నీ వదిలేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావటంతో.. ఘటన వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment