social media viral :woman wedding in china - Sakshi
Sakshi News home page

వైరల్‌: మగ స్నేహితులనే  తోడిపెళ్లికూతుళ్లుగా మార్చేసింది

Published Sun, Jun 6 2021 11:16 AM | Last Updated on Sun, Jun 6 2021 2:44 PM

Woman Wedding In Pingdingshan At China Have Gone Viral On Social Media - Sakshi

ఏదైనా సోషల్‌ మీడియాకు వార్తే.. తర్వాత అది వైరలే!  అలాంటి  ఘటనే ఒకటి చోటుచేసుకుంది చైనా, హెనాన్‌ ప్రావిన్స్‌లోని పింగ్డిన్షాన్‌ అనే నగరంలో అక్కడ జరిగిన  ఓ యువతి పెళ్లిలో ఆమె పక్కనే ఓ ముగ్గురు.. తోడి పెళ్లికూతుళ్లలా.. గులాబి రంగు గౌన్లు, పొడవాటి కురులు, మెకప్‌ మెరుగులతో పెళ్లికూతురు కంటే అందంగా తయారై ఆహుతుల మనసు దోచుకున్నారు. ఇది వైరల్‌ కావాల్సిన వార్తా? అని చిరాకు దృష్టి తిప్పకండి.. ఆ ముగ్గురు అమ్మాయిలు కాదు అబ్బాయిలు.  అక్కడి సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు స్నేహితురాళ్లే తోడిపెళ్లికూతుళ్లుగా  ఉండాలి. 

కానీ  పెళ్లికూతురికి స్నేహితురాళ్లు లేకపోవడంతో ఆమె తన మగ స్నేహితులనే  తోడిపెళ్లికూతుళ్లుగా మార్చేసింది. ఆ ప్లాన్‌ సక్సెస్‌ అయింది. అతిథులెవరూ వాళ్లు అబ్బాయిలని పసిగట్టలేకపోయారు పైగా అందమైన అమ్మాయిల్లా కనిపించే సరికి పెళ్లికూతురిని పక్కన పెట్టి మరీ ఫొటోలు, వీడియోలు తీసుకోవడం మొదలుపెట్టారు. తర్వాత వాళ్లు అబ్బాయిలు అని తెలిసేసరికి ఆ ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీడియోలతోపాటు వన్నెల దొరల విషయమూ తెలిశాక వైరల్‌ అవకుండా ఉంటుందా? అయింది.
చదవండి: కరోనా అనుమానంతో పట్టించుకోలేదు! ఎంత ఘోరమంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement