Zelensky Slams NATO For Rejecting No-Fly Zone Over Ukrainian - Sakshi
Sakshi News home page

Zelensky-NATO: జెలెన్‌ స్కీ తీవ్ర ఆవేదన.. బాంబులు వేసేందుకే ఇలా చేశారా..

Published Sat, Mar 5 2022 2:23 PM | Last Updated on Sat, Mar 5 2022 4:53 PM

Zelensky Slams NATO For Rejecting No-Fly Zone Over Ukrainian - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో పది రోజులుగా జరుగుతున్న భీకర దాడులకు కొంత విరామం దొరికింది. శనివారం రష్యా.. యుద్ధానికి తాత్కాలికంగా విరామం ప్రకటించింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ నుంచి పౌరుల తరలింపునకు రష్యా అవకాశం కల్పించింది. 

ఇదిలా ఉండగా.. నాటోపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఉక్రెయిన్‌పై నో-ఫ్లై జోన్‌ను ప్రకటించాలని జెలెన్‌ స్కీ నాటోను అభ్యర్థించారు. ఉక్రెయిన్‌ విజ్ఞప్తిని నాటో తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో జెలెన్‌ స్కీ.. శనివారం ఓ వీడియో ప్రసంగాన్ని విడుదల చేశారు. ఈ ప్రసంగంలో నాటోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో సమావేశం చాలా బలహీనమైనది, అయోమయంతో కూడుకున్నదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాటో నిర్ణయం వల్ల ఉక్రెయిన్‌లోని నగరాలు, పట్టణాలపై రష్యా బాంబులు వేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే యూరప్‌ స్వేచ్చనే మొట్టమొదటి లక్ష‍్యమని నాటో గుర్తించాలన్నారు. 

ఇదిలా ఉండగా.. నో​-ఫ్లైజోన్‌ విధించడం కారణంగా ఓ దేశాన్ని శత్రు దేశాల నుంచి కాపాడుకోవడం సులభతరం అవుతుంది. ఓ దేశంలో నో-ప్లై జోన్‌ అమలులోకి వస్తే.. ఆ గగనతలంలోకి వచ్చే శత్రుదేశ విమానాలను కూల్చి వేసేందుకు మార్గం సుగమం అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement