ఉమ్మడి కరీంనగర్‌లో విద్యాధికుల మధ్యే పోరు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి కరీంనగర్‌లో విద్యాధికుల మధ్యే పోరు

Published Wed, Aug 30 2023 12:40 AM | Last Updated on Wed, Aug 30 2023 9:15 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీలు అభ్యర్థులను రంగంలోకి దింపే పనిలోపడ్డాయి. ఇందులో బీఆర్‌ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఒకడుగు ముందే వేయగా.. కాంగ్రెస్‌ ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుని కసరత్తు ప్రారంభించిది. ఇక బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికలో సీరియస్‌గానే పనిచేస్తోంది.

మొత్తానికి అన్ని పార్టీల అభ్యర్థులకు అంగబలం, అర్దబలం, సామాజిక వర్గాలతోపాటు విద్యావంతులను ఎంపికచేసే పనిలోపడ్డాయి. ప్రస్తుతం పోటీకి సిద్ధంగా ఉన్న అధికార పార్టీ అభ్యర్థులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఆశావహులు దాదాపుగా ఉన్నత విద్యావంతులు కావడం విశేషం. అన్ని పార్టీలపరంగా ఆశావహుల విద్యార్హతలను పరిశీలిస్తే.. అందరిలో అధికంగా డాక్టర్లే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో వకీల్‌సాబ్‌లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, బీటెక్‌బాబులు, గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో ఈసారి అసెంబ్లీ బరిలో ఉన్నత విద్యావంతుల చాలామంది నిలవనున్నారు.

పదిమంది పేర్ల ముందు డాక్టర్‌

1. డాక్టర్‌ సంజయ్‌, ఎంఎస్‌, ఎమ్మెల్యే (బీఆర్‌ఎస్‌–జగిత్యాల)

2. డాక్టర్‌ సంజయ్‌, ఎంఎస్‌, (బీఆర్‌ఎస్‌–కోరుట్ల)

3. డాక్టర్‌ భోగ శ్రావణి, బీడీఎస్‌ (బీజేపీ–జగిత్యాల)

4. డాక్టర్‌ వికాస్‌బాబు, ఎంబీబీఎస్‌ (బీజేపీ– వేములవాడ)

5. డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంఎస్‌ (కాంగ్రెస్‌–మానకొండూరు)

6. డాక్టర్‌ బల్మూరి వెంకట్‌, ఎంబీబీఎస్‌ (కాంగ్రెస్‌–హుజూరాబాద్‌)

7. డాక్టర్‌ జేఎన్‌ వెంకట్‌, ఎంబీబీఎస్‌ (బీజేపీ–కోరుట్ల)

పీహెచ్‌డీ డాక్టర్లు

8. డాక్టర్‌ రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్యే (బీఆర్‌ఎస్‌–మానకొండూరు)

9. డాక్టర్‌ కొనగాల మహేశ్‌ (కాంగ్రెస్‌–కరీంనగర్‌)

10. డాక్టర్‌ మేడిపల్లి సత్యం (కాంగ్రెస్‌–చొప్పదండి)

వకీల్‌సాబ్‌లు వీరే..

1. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎల్‌ఎల్‌బీ ఎమ్మెల్యే (కాంగ్రెస్‌–మంథని)

2. టి.జీవన్‌రెడ్డి, ఎల్‌ఎల్‌బీ, ఎమ్మెల్సీ (కాంగ్రెస్‌–జగిత్యాల)

3. ఎ.మోహన్‌, ఎల్‌ఎల్‌బీ, మాజీ ఎమ్మెల్యే (మానకొండూరు)

4. కేకే మహేందర్‌రెడ్డి, ఎల్‌ఎల్‌బీ (కాంగ్రెస్‌–సిరిసిల్ల)

ఇంజినీర్లు

1. గంగుల కమలాకర్‌, బీటెక్‌(సివిల్‌) మంత్రి (బీఆర్‌ఎస్‌–కరీంనగర్‌)

2. దాసరి ఉష, ఐఐటీ ఖరగ్‌పూర్‌ (బీఎస్పీ– పెద్దపల్లి)

3. చలిమెడ లక్ష్మీనరసింహారావు, బీటెక్‌ (బీఆర్‌ఎస్‌– వేములవాడ)

4. వొడితెల సతీశ్‌బాబు, ఎంటెక్‌, ఎమ్మెల్యే (బీఆర్‌ఎస్‌–హుస్నాబాద్‌)

5. నక్కా విజయ్‌బాబు, బీటెక్‌ (బీజేపీ– ధర్మపురి)

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌

1. కేటీఆర్‌, ఎంబీఏ(యూఎస్‌ఏ), మంత్రి (బీఆర్‌ఎస్‌–సిరిసిల్ల)

2. కోరుకంటి చందర్‌, ఎంఏ, ఎమ్మెల్యే (బీఆర్‌ఎస్‌– రామగుండం)

3. దాసరి మనోహర్‌రెడ్డి, ఎంఏ, ఎమ్మెల్యే (బీఆర్‌ఎస్‌– పెద్దపల్లి)

4. పొన్నం ప్రభాకర్‌, ఎంఏ, మాజీ ఎంపీ (కాంగ్రెస్‌– హుస్నాబాద్‌)

5. సోమారపు సత్యనారాయణ, పీజీ (బీజేపీ–రామగుండం)

6. జువ్వాడి నర్సింగరావు, పీజీ (కాంగ్రెస్‌–కోరుట్ల)

గ్రాడ్యుయేట్లు

1. ఈటల రాజేందర్‌, బీఎస్సీ, ఎమ్మెల్యే (బీజేపీ–హుజూరాబాద్‌)

2. బండి సంజయ్‌, డిగ్రీ, ఎంపీ (బీజేపీ–కరీంనగర్‌)

3. రోహిత్‌రావు, గ్రాడ్యుయేషన్‌ (ఆస్ట్రేలియా) (కరీంనగర్‌–కాంగ్రెస్‌)

4. కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, గ్రాడ్యుయేట్‌ (కరీంనగర్‌–కాంగ్రెస్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement