పెద్దాపూర్ గురుకులంలో కలెక్టర్ బస
మెట్‌పల్లిరూరల్: గురుకులాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకులాన్ని శనివారం రాత్రి సందర్శించిన ఆయన అక్కడే బస చేశారు. గురుకులం పరిసరాలు, తరగతి, వసతి గదులు, డైనింగ్, భోజనం, మెనూ, స్టోర్‌రూంలో నిల్వ ఉంచిన సరుకులను పరిశీలించారు. విద్యార్థులతో భోజనం చేశారు. కాసేపు క్యారం, చెస్ ఆడారు. లక్ష్యసాధన కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని సూచించారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని, అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మహేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఐ ఉమేశ్, ప్రిన్సిపాల్ మాధవీలత, సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధిహామీ కూలీలను పెంచాలి
జగిత్యాల: ఒక్కో గ్రామంలో 50 మందికి తక్కువ కాకుండా ఉపాధి కూలీలతో పనులు చేయించాల ని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో సమావేశమయ్యారు. మార్చి 10వరకు ఇంటి పన్ను వసూలు చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది రానీయొద్దన్నారు. బోర్లు, చేతిపంపులు మరమ్మతు చేయించాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసిన వాటిని రెన్యువల్ చేయాలని ఆదేశించారు. డీఆర్డీవో రఘువరణ్, మున్సిపల్ కమిషనర్ చిరంజీవి పాల్గొన్నారు.
ఇసుక రీచ్ తనిఖీ
కథలాపూర్: మండలంలోని సిరికొండ వాగులో ఉన్న ఇసుక రీచ్‌ను కలెక్టర్ శనివారం రాత్రి తని ఖీ చేశారు. రోజువారీగా ఎంత ఇసుకను తీసుకెళ్తున్నారు..? ఎవరెవరు తీసుకెళ్తున్నారని అడిగి తెలు సుకున్నారు. ఇసుక విషయంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా వ్యవహరించాలని ఆదేశించారు. ఆయన వెంట మైనింగ్‌శాఖ ఏడీ జయసింగ్, తహసీల్దార్ వినోద్, ఆర్‌ఐ నాగేశ్ ఉన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment