‘పది’ పరీక్షలు పకడ్బందీగా పూర్తి చేయాలి
జగిత్యాల: త్వరలో జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ లత అ న్నారు. శనివారం విద్యాశాఖ అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. పరీక్షల కోసం జిల్లావ్యాప్తంగా 67 సెంటర్లను ఏర్పాటు చేశామని, 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధి కారులు, 20 మంది వెహికిల్ బాధ్యులు, 28 మంది కస్టోడియన్ అధికారులను నియమించామన్నారు. తరగతి గదులను శుభ్రం చేయాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఫలి తాల్లో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలని ఆదేశించారు. డీఈవో రాము, కో–ఆర్డినేటర్స్ పాల్గొన్నారు.
జిల్లాలో 67 పరీక్ష కేంద్రాలు
అదనపు కలెక్టర్ లత
Comments
Please login to add a commentAdd a comment