గ్రామాల్లో నీటి ఎద్దడి రానీయొద్దు
రాయికల్: వేసవి దృష్ట్యా గ్రామాల్లో నీటిఎద్దడి రానీయొద్దని, డీపీవో మదన్‌మోహన్ సూచించారు. మండలంలోని భూపతిపూర్ నర్సరీ, జీపీ రికార్డులను శనివారం పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని, మార్చిలోపు వందశాతం పన్నులు వసూలు చేయాలని సూ చించారు. ఆయన వెంట ఎంపీవో సుష్మ ఉన్నారు.
రాజగోపురంతో దుబ్బ రాజన్నకు కళ
సారంగాపూర్: మండలంలోని దుబ్బ రాజన్న ఆలయానికి రాజగోపురం, ప్రాకా రాలు పూర్తి కావస్తుండడంతో ఆలయానికి కొత్త కళ వ స్తోంది. ఆలయానికి చుట్టూ సాధారణ ప్రహరీ తొలగించి.. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం తరహాలో కొత్త ప్రహరీ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. జగిత్యాల–సారంగాపూర్ ఆర్‌ఆండ్‌బీ ప్రధాన రహదారిని ఆనుకొని చేపట్టిన రాజగోపురం పనులు దాదాపు పూర్తవుతున్నాయి. ఈ నిర్మాణాలకు సీఎంగా కేసీఆర్, నిజామాబాద్ ఎంపీగా కవిత ఉన్న సమయంలో దేవాదాయశాఖ నుంచి రూ.82 లక్షలు విడుదలయ్యాయి. ఆ నిధులతోపాటు ఆలయ అర్చకులు, పెంబట్ల, కోనాపూర్ గ్రామపెద్దలు, జగిత్యాల ప్రాంతానికి చెందిన పెద్దల నుంచి రూ.22లక్షలు వి రాళాలు సేకరించారు. రాజ గోపుర నిర్మాణాని కి కొంతభూమి అవసరంకా గా.. ఆలయ అర్చకుడు శానగొండ కై లాసం సమకూర్చారు. రా జగోపురానికి కేవలం శిల్పుల పనిమాత్రమే మిగిలి ఉంది. దుబ్బరాజన్న జాతర బ్రహ్మోత్సవాలు పూర్తికాగానే మరో నాలుగు నెలల్లో పనులు పూర్తి చేస్తామని అధికారులు, నాయకులు చెబుతున్నారు.
గ్రామాల్లో నీటి ఎద్దడి రానీయొద్దు
Comments
Please login to add a commentAdd a comment