ధర్మపురి/బుగ్గారం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోరారు. ధర్మపురి, బుగ్గారంలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ చేపడుతున్న పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, కాసారపు బాలాగౌడ్ ఉన్నారు. బుగ్గారంలో పార్టీ మండలశాఖ అధ్యక్షుడు వేముల సుభాష్, నాయకులు నర్సాగౌడ్, చిగిరి అంజిత్‌కుమార్, జంగ శ్రీనివాస్, నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
యూరియా అందుబాటులో ఉంచాలి
జగిత్యాలరూరల్: రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రఘునందన్‌రావుకు సూచించారు. ఈ మేరకు ఆయనతో ఫోన్లో మాట్లాడారు. జిల్లాలో వరి పొట్టదశలో ఉందని, యూరియా అందుబాటులో లేక పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. 30 శాతం మంది మొక్కజొన్న సాగు చేయడంతో యూరియా కొరత ఏర్పడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment