కార్యకర్తలే ప్రధాని మోదీ బలం
● నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
మల్లాపూర్: కార్యకర్తలే ప్రధాని నరేంద్ర మోదీ బలమని, వారి కృషితోనే వరుసగా మూడుసార్లు విజయం సాధించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శనివారం మండలకేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రాజకీయ వ్యవస్థను నాశనం చేస్తున్నాయని, పంటలను అమ్ముకోవడానికి, మద్దతు ధర కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అనారోగ్యానికి గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు, అసెంబ్లీ కన్వీనర్ సుఖేందర్‌గౌడ్, మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎర్ర లక్ష్మీ పాల్గొన్నారు.
బీజేపీ అఽభ్యర్థుల గెలుపు ఖాయం
కోరుట్ల: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు ఖాయమని అర్వింద్ అన్నారు. శనివారం రాత్రి కోరుట్లలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచార సభలో మాట్లాడారు. కోరుట్లలో సగానికిపైగా ఓటర్లు బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలని తీర్మానించుకున్నారని పేర్కొన్నారు. కులం, మతం పక్కన బెట్టి దేశ భవిష్యత్ లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య మాట్లాడుతూ.. విద్యారంగ పటిష్టత, నిరుద్యోగుల ఇబ్బందులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నాయకులు మోరపెల్లి సత్యనారాయణ, బోగ శ్రావణి, రుద్ర శ్రీనివాస్, మాడవేని నరేశ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment