మెడికల్ కళాశాల భవనం పూర్తి చేయండి
‘రాళ్లవాగు’ను
పరిశీలించిన ప్రభుత్వ విప్
కోరుట్ల: కోరుట్లలోని సీ.ప్రభాకర్ స్మారక గ్రంథాలయానికి తనవంతుగా పుస్తకాలు అందిస్తానని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. గ్రంథాలయాన్ని సోమవారం సందర్శించారు. పుస్తకాలను పరిశీలించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. గ్రంథాలయంలో పుస్తకాలు చదివి 18 మంది ఉద్యోగాలు సాధించారని నిర్వాహకులు ఎమ్మెల్యేకు తెలిపారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు అందిస్తానని పేర్కొన్నారు. గ్రంథాలయం గౌరవ అధ్యక్షుడు చెన్నా విశ్వనాథం, అధ్యక్షుడు రాస భూమయ్య, ఉపాధ్యక్షుడు సుతారి రాములు, ప్రధాన కార్యదర్శి గొడిక రాజు పాల్గొన్నారు.
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. సోమవారం హైదరాబాద్‌లో మెడికల్ కళాశాల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ట్రంలోనే ఫేజ్–1లో మెడికల్ కళాశాల మంజూరైందని, పనులు కొంతమేర జరిగాయని, బిల్లుల చెల్లింపు ఆలస్యం అవుతోందని పేర్కొన్నారు. కళాశాలలో బాలుర, బాలికల వసతి గృహాల పనులు జాప్యమవుతున్నాయని తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన క్రిటికల్ కేర్‌యూనిట్‌కు అవసరమైన సామగ్రిని త్వరితగతిన అందించాలని విజ్ఞప్తి చేశారు.
కథలాపూర్: మండలంలోని భూషణరావుపేట శివారులోగల రాళ్లవాగు ప్రాజెక్టును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం పరిశీలించారు. కుడికాలువను సీసీతో నిర్మిస్తే భూషణరావుపేట, కథలాపూర్, ఊట్‌పెల్లి గ్రామాల పరిధిలోని భూములకు నీరందుతుందని రైతులు విప్‌కు విన్నవించారు. శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఆయన వెంట నాయకులు కాయితి నాగరాజు, చెదలు సత్యనారాయణ, స్వామిరెడ్డి, గడ్డం చిన్నారెడ్డి, తలారి మోహన్, అశోక్ పాల్గొన్నారు.
గ్రంథాలయానికి పుస్తకాలు సమకూరుస్తా
మెడికల్ కళాశాల భవనం పూర్తి చేయండి
మెడికల్ కళాశాల భవనం పూర్తి చేయండి
Comments
Please login to add a commentAdd a comment