లోక్‌అదాలత్ వినియోగించుకోండి
ధర్మపురి: స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో ఈనెల 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి శ్యామ్‌ప్రసాద్ తెలిపారు.ఽ ఈ మేరకు న్యాయవాదులతో సోమవారం సమావేశం అయ్యారు. వివిధ సమస్యలపై కోర్టులో నడుస్తున్న చిన్నపాటి కేసులపై కక్షిదారులు రాజీకి రావాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామడుగు రాజేశ్, ప్రధాన కార్యదర్శి బందెల రమేశ్, ట్రెజరర్ జాజాల రమేశ్, న్యాయవాదులు ఇమ్మడి శ్రీనివాస్, రమ్య, రాజు తదితరులున్నారు.
డీఏవో రాంచందర్ సస్పెన్షన్
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లా వ్యవసాయ అధి కారి రాంచందర్‌ను సస్పెండ్ చేస్తూ.. రాష్ట్ర వ్య వసాయ శాఖ కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో వడ్డెపల్లి భాస్కర్‌ను నియమిస్తూ ఉ త్తర్వులు వెలువడ్డాయి. దీంతో భాస్కర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. భాస్కర్ గతంలో సిరిసిల్ల జిల్లా వ్యవసాయాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం నిర్మల్ ఏడీఏగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జగిత్యాలకు వచ్చారు.
దుబ్బరాజన్న హుండీ ఆదాయం రూ. 22.56 లక్షలు
సారంగాపూర్: మండలంలోని దుబ్బరాజన్నకు మహాశివరాత్రి జాతర, బ్రహ్మోత్సవాల ద్వారా వచ్చిన హుండి ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. మొత్తంగా రూ.22,56,619 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. అలాగే 27.27 గ్రాముల బంగారం, 9.340కిలోల మిశ్రమ వెండి వచ్చింది. దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ నాయిని సుప్రియ, డివిజన్ ఇన్‌స్పెక్టర్ రాజమౌళి, ఈవో అనూష, వ్యవస్థాపక ధర్మకర్త పొరండ్ల శంకరయ్య, బొడ్డుపల్లి రాజన్న తదితరులు ఉన్నారు.
దుబ్బరాజన్నకు ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం
సారంగాపూర్: మండలంలోని దుబ్బరాజన్న ఆలయంలో సోమవారం స్వామివారికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల అనంతరం వచ్చే మొదటి సోమవారం ఆలయాన్ని శుద్ధి చేస్తారు. స్వామివారికి అర్చకులు పంచామృతాలు, భస్మం, వివిధ పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, పాలతో గంటన్నర పాటు రుద్రాభిషేకం నిర్వహించారు.
లోక్‌అదాలత్ వినియోగించుకోండి
లోక్‌అదాలత్ వినియోగించుకోండి
Comments
Please login to add a commentAdd a comment