ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
● జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల: జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం వివిధ ఇంటర్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఫ్‌లైయింగ్ స్క్వాడ్‌లతో సమీక్షించారు. ఈనెల ఐదోతేదీ నుంచి 25వరకు జరిగే పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో 28 పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేశామని, మొబైల్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లను కేంద్రాల్లోకి అనుమతించబోమని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లత, నోడల్ అధికారి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment