జగిత్యాల: పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారని, మళ్లీ బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈనెల 23న కరీంనగర్‌లో కేటీఆర్ పాల్గొననున్న సన్నాహక సమావేశంపై శుక్రవారం బీఆర్‌ఎస్ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నో అభివృద్ధి పథకాలు చేపట్టి ప్రజల గుండెల్లో నిలిచిన ఏకై క వ్యక్తి కేసీఆర్ అ న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, త్వరలో మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. సన్నాహాక సభకు జిల్లా నుంచి అత్యధిక మంది తరలిరావాలని కోరారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ బాపురెడ్డి పాల్గొన్నారు.
క్షయపై అవగాహన కల్పించాలి
జగిత్యాల: క్షయపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం మెడికల్ కళాశాలలో విద్యార్థులకు క్షయపై క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరికై నా క్షయ లక్షణాలు కన్పిస్తే ఆస్పత్రికి పంపించి చికిత్స తీసుకునేలా తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం విద్యార్థులను 10 గ్రూపులుగా విభజించి క్విజ్ కాంపిటిషన్ నిర్వహించారు. ఈనెల 24న జరిగే వరల్డ్ టీబీ డే కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సునీల్‌రావు, జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సుమన్‌రావు, క్షయ నివారణ అధికారి శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అర్చన తదితరులు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి