● ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జగిత్యాలరూరల్: అకాల వర్షాలు, ఈదురుగాలులతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్, గుట్రాజ్‌పల్లి, అనంతారం, హైదర్‌పల్లి, కండ్లపల్లి గ్రామాల్లో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రెవెన్యూ, వ్యవసాయాధికారులతో వెంటనే నష్టపోయిన పంటలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులకు పరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను వెంటనే అధికారులు గుర్తించి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మంగళారపు మహేశ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జున్ను రాజేందర్, గాజంగి నందయ్య, లైశెట్టి శేఖర్, వెంకట్, లైశెట్టి విజయ్ ఉన్నారు.