● అసెంబ్లీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల: నియోజకవర్గంలో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సోమవారం శాసనసభలో కోరారు. మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల భవనాలు, సమీకృత మార్కెట్ల నిర్మాణ పనులకు సరిపడా నిధులు ఇవ్వకపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయని వివరించారు. ప్రతి సమావేశంలో తాను ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నానని, వాటికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండు పట్టణాల్లోని జర్నలిస్టులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు వారికి కేటాయించలేదని, సమస్యను పరిష్కరించాలని కోరారు.