
ఉగ్రవాదుల వెన్నులో వణుకుపుట్టాలి
ధర్మపురి: జమ్మూకాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన వారి ఆత్మ శాంతించాలంటే ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టేలా కేంద్రప్రభుత్వ చర్యలు ఉండాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సంతాప సభ ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నామన్నారు. ఉగ్రవాదుల దాడిలో 28 మంది మృతి చెందడం.. మరో 20 మంది వరకు గాయపడడం కలచివేస్తోందని తెలి పారు. భవిష్యత్తులో ఏ ఒక్క టెర్రరిస్టు కూడా దేశం వైపు కన్నెత్తి చూసే సాహసం చేయకుండా కేంద్రం చర్యలు చేపట్టాలని, అందుకు అండగా ఉంటామని వివరించారు. నాయకులు వేముల రాజు, చీపిరిశెట్టి రాజేశ్, చిలుముల లక్ష్మణ్, సీపతి సత్యనారాయణ, కుంట సుధాకర్, గడ్డం భాస్కర్‌రెడ్డి, సింహరాజు ప్రసాద్ ఉన్నారు.
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్