
ఠారెత్తిస్తున్న ఎండలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా గురువా రం భానుడు తన ఉగ్రరూపం చూపించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 26 నుంచి 28 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకే పరిస్థితి నెలకొంది. ఎండపల్లి మండలం మారేడుపల్లిలో అత్యధికంగా 44.9 డిగ్రీలు, గొల్లపల్లి, మల్లాపూర్, మల్లాపూర్ మండలం రాఘవపే ట, వెల్గటూర్‌లో 44.8, బీర్‌పూర్ మండలం కొల్వాయి, బుగ్గారం మండలం సిరికొండలో 44.7, ధర్మపురి మండలం జైన, ఇబ్రహీంపట్నం గోధూర్‌లో 44.6, పెగడపల్లి, కోరుట్ల మండలం అయిలాపూర్, సారంగాపూర్‌లో 44.5 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి.
● 45 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు