
విజయబావుటా ఎగురవేయాలి
స్టేషన్‌ఘన్‌పూర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేసేలా పాటుపడాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీల నాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యాన ప్రభుత్వం కులగణనపై, ఎస్సీ వర్గీకరణపై సాహసోపేత నిర్ణయం తీసుకుందన్నారు. అయితే ఇష్టం లేని బీజేపీ, బీఆర్‌ఎస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నట్లు ఆరోపించారు.
సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక
సర్వే ఆధారంగా ప్రజాబలం ఉన్న గెలుపు గుర్రాల కు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సోషల్ మీడియా వేదికగా బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టాలని, ఈ విషయమై యూత్ కాంగ్రెస్ నాయకులు బాధ్యతగా పనిచేయాలని సూచించా రు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ గెలుపునకు ఐక్యంగా పనిచేయాలని కోరారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, రాష్ట్ర నాయకులు సీహెచ్.నరేందర్‌రెడ్డి, బెలిదె వెంకన్నతో పాటు పార్టీ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, పోగుల సారంగపాణి, బూర్ల శంకర్, శ్రీధర్‌రావు, లింగాజీ, జగదీష్‌రెడ్డి, నీరటి ప్రభాకర్, కొలిపాక సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Comments
Please login to add a commentAdd a comment