
మహాకుంభాభిషేకం విజయవంతం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజులపాటు వైభవోపేతంగా నిర్వహించిన మహాకుంభాభిషేక మహోత్సవాలకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఈఓ ఎస్.మహేశ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ రాహుల్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసి మహాకుంభాభిషేక ఘట్టం దిగ్విజయం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, మీడియాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
● కాళేశ్వరం దేవస్థానం
ఈఓ ఎస్.మహేశ్
Comments
Please login to add a commentAdd a comment