
మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలు
పాలకుర్తి టౌన్ : శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలను అధికారులు సమన్వయంతో విజయవతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం ఆలయ కల్యాణ మండపంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జాతరలో ప్రచార ఫ్లెక్సీలు ఏర్పా టు చేయొద్దన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు పీఆర్ శాఖ ఆధ్వర్యాన 130 మంది జీపీ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. నాలుగుచోట్ల వాహనాల పార్కింగ్, గుట్టపైన దర్శనానికి వెళ్లే భక్తులకు క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్, తొర్రూరు, జనగామ, సూర్యాపేట డిపోల నుంచి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడించా ల ని సంబంధిత అధికారులకు సూచించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ బందోబస్తు కు 200 మంది పోలీసులను నియమించడంతో పాటు సీసీ కెమారులు, పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేట్ వాహనాల పా ర్కింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాన్స్‌కో డీఈ రాంబాబు మాట్లాడతూ జాతర ముగిసేంత వరకు నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్ మాట్లాడుతూ జారతలో భక్తులకు వైద్య సేవలు అందించేందుకు ఆలయ ఆవరణలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మహాశిరాత్రి జాతర వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో డీపీఓ స్వరూప, ఆర్టీఓ వెంకన్న, డీఆర్‌డీఓ వసంత, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ మహేందర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాములు, ఆలయ ఈఓ మోహన్‌బాబు, సీపీఓ లక్ష్మీప్రసన్న, ఎస్సై పవన్‌కుమార్ పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలి
సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా
విద్యార్థులను కొట్టొద్దు : కలెక్టర్
ఉపాధ్యాయులు విద్యార్థులను కొట్టవద్దని.. ప్రేమతో చదువు నేర్పాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మండల కేంద్రంలోని తెలంగా ణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌తో కలిసి సందర్శించారు. ఇటీవల గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఉపాధ్యాయురాలు కొట్టిన ఘటన గురించి ప్రిన్సిపాల్ స్వరూపను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల మధ్య గొడవను విద్యార్థుల మీదకు తేవద్దన్నారు. అనంతరం పదవ తరగతి విద్యార్థినులకు పాఠాలు బోధించారు. ఆయన వెంట ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ రాకేష్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment