
వరంగల్ జిల్లాకు చేరుకున్న సర్వే హెలికాప్టర్
● నేడు వర్ధన్నపేటలో ఏరియల్ సర్వే
కాజీపేట రూరల్ : మున్సిపాలిటీల పూర్తి వివరాలు (స్థలాలు, ఇళ్లు, భవనాలు, చెరువులు, గుట్టలు, రోడ్లు, హాస్పి టళ్లు, తదితర సమాచారం) తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వంద మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణ నుంచి పది ఎంపికయ్యాయి. నక్ష ద్వారా జియో ట్యాగింగ్, టుడీ/త్రీడీ మ్యాపింగ్‌తో ఆయా మున్సిపాలిటీల్లో ఆర్.వి. అసోసియేట్ ఏజెన్సీ ద్వారా హెలికాప్టర్‌తో ఏరియల్ సర్వే చేస్తోంది. ఈ నేపథ్యంలో పైలట్ ప్రాజ్టెక్‌లో భాగంగా వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాలను సర్వే చేయడానికి హెలికాప్టర్ నగరంలోని సేయింట్ గ్యాబ్రియల్ స్కూల్‌లో ల్యాండ్ అయింది. ఆది, సోమవారాల్లో జగిత్యాల, హుస్నాబాద్‌లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. మంగళవారం వర్ధన్నపేట మున్సిపాలిటీ ప్రాంతంలో సర్వే చేయనున్నారు. ఏరియల్ సర్వేకు కమిటీ సభ్యులుగా వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్, జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ రికార్డు అధికారి, ఇరిగేషన్ ఈఈ, ఆర్‌అండ్‌బీ ఈఈ, డీపీఓ, వర్ధన్నపేట ఏసీపీ ఉన్నారు.
సర్వే హెలికాప్టర్‌ను సందర్శించిన
కలెక్టర్ సత్యశారద
కాజీపేట సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్‌లో ల్యాండ్ అయిన హెలికాప్టర్‌ను వరంగల్ కలెక్టర్ సత్యశారద సందర్శించారు. ఈ సందర్భంగా ఏరియల్ సర్వే వివరాలు తెలుసుకున్నారు. నావిగేటర్ నిదేశ్‌కుమార్, మేనేజర్ మల్లారెడ్డి ఏరియల్ సర్వే సిస్టమ్, ప్రాంతాల మ్యాపింగ్, టెక్నాలజీ, ఫొటోగ్రఫీ క్యాప్చరింగ్, రికార్డు సిస్టమ్, ఇతర సాంకేతికపర వివరాలను కలెక్టర్‌కు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment